This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Attarintiki-Daredi
Song » Veedu Aaradugula bullettu / వీడు ఆరడుగుల బుల్లెట్టు
Click To Rate




* Voting Result *
0 %
25.00 %
0 %
0 %
75.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

ee paaTaki saMbaMdhiMchina saMdarbhaM , ardhaM guriMchi  - rachayita SreemaNini aDigitae aayana javaabidi :  
'aaraDugula bulleT^’. paaTa maatraM okkasaarigaa nannu naluguru nOLlallO naanaelaa chaesiMdi  .pavar^sTaar^, trivikram^, daeviSree kaaMbinaeshan^lO vachchina ‘attaariMTiki daaraedi’ sinimaalO pavan^kaLyaaN^ gaariki paaTa raastunnaanu kaabaTTi aa paaTa O raeMj^lO uMDaali.. appuDae aayana imaej^ni aMdukOgalugutaanu anae tapana uMdi tappa aMta pedda heerOki paaTa raastunnaanu anae Tenshan^ laedu naaku .
telugu padaallO gaganaM, sammataM, sameepaM, sameeraM, pinaakapaaNi, kaeLakuLi (sugaMdhadravyaalatO kooDina maeghaM) ilaaMTi padaalaMTae ishTaM. saMdarbhaM kooDaa tODavaDaMtO ee paaTanu 'gaganapu veedhi' ani praaraMbhiMchaanu. iMdulO chaalaa padaalu aMdarikee telisinavae kaanee evaroo aMtagaa vaaDaru. nagamu, nartanaSauri anae padaalu maatraM koMtamaMdiki teliyaka vaaTi arthamaeMTi ani phOnlu chaesi aDigaaru. reMDu nelala paaTu ee paaTapai vark^ chaeSaanu. ee paaTalO saakee uMTuMdi. pallavi uMTuMdi. O huk^lain^ uMTuMdi. deennoka prayOgaMlaa chaeSaaM. ee paaTalO saakeeni - kaartikaeyan^ paaDaaru. migilina paaTanu vijayaprakaash^ paaDaaru. 
 
gaganapu veedhi veeDi valasa veLlipOyina neelimabbu kOsaM 
taraliMdi tanaku taanae aakaaSaM.. paradaeSaM 
Sikharapu aMchu nuMchi naela jaaripOyina neeTichukka kOsaM 
viDichiMdi chooDu nagamae tana vaasaM.. vanavaasaM 
 
ikkaDa nagamaMTae koMDa ani arthaM. nijaaniki nagaM annachOTa SikharaM vaaDavachchu kaanee vaaDina padaanni maLlee vaaDakuMDaa uMDaalani koMDa, SailaM, giri, nagaM ilaa konnipaerlu soochistae trivikram^ gaaru nagaM 
 
padaanni selekT^ chaeSaaru. 
naDichochchae nartanaSauri 
parigettae paraakrama Saili 
haalaahalaM dhariMchina dagdha hRdayuDO.. 
 
iMdulO nartanaSauri aMTae nartiMchae kRshNuDu ani arthaM. kaaLiMdi mardanaM saMdarbhaMgaa ee paeru vachchiMdi. kathaanaayakuDiki sariggaa saripOyae padaM ani adi vaaDaanu. tarvaata ‘dagdha hRdayuDO’ anae prayOgaM chaeSaanu. adi kooDaa chaalaamaMdiki nachchiMdi. paaTa charaNaallO kathaa naepathyaanni parichayaM chaeSaanu. ee paaTa raayaDaM O goppa paaThaMlaa anipiMchiMdi. naepathyaMlO vachchae paaTalu elaa uMDaalanae daani guriMchi chaalaa naerchukunnaanu. daeviSreegaariki naenu eppuDu paaTalu raasinaa chaalaa vershans^ raasukeLataanu. eMdukaMTae ee eks^preshan^ baanae uMdi kadaa, adae uMchaeddaaM anae aalOchana aayanakuMDadu. eppuDoo besT^ kOrukuMTaaru. aayanatO panichaestuMTae snaehitulatO saayaMtraM pooTa kaburlu cheppukuMTunnaTTO, TeekoTTu daggara baataakhaanee chaestunnaTlO uMTuMdi. aayana ennO vishayaalu chebutaaru. aa maaTallOnae ennO vishayaalu naerputaaru kooDaa!
Important information - Telugu

à°ˆ పాటకి సంబంధించిన సందర్భం , అర్ధం గురించి  - రచయిత శ్రీమణిని అడిగితే ఆయన జవాబిది :  
'ఆరడుగుల బుల్లెట్‌’ పాట మాత్రం ఒక్కసారిగా నన్ను నలుగురు నోళ్లల్లో నానేలా చేసింది  .పవర్‌స్టార్‌, త్రివిక్రమ్‌, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ గారికి పాట రాస్తున్నాను కాబట్టి à°† పాట à°“ రేంజ్‌లో ఉండాలి.. అప్పుడే ఆయన ఇమేజ్‌ని అందుకోగలుగుతాను అనే తపన ఉంది తప్ప à°…à°‚à°¤ పెద్ద హీరోకి పాట రాస్తున్నాను అనే టెన్షన్‌ లేదు నాకు .
తెలుగు పదాల్లో గగనం, సమ్మతం, సమీపం, సమీరం, పినాకపాణి, కేళకుళి (సుగంధద్రవ్యాలతో కూడిన మేఘం) ఇలాంటి పదాలంటే ఇష్టం. సందర్భం కూడా తోడవడంతో à°ˆ పాటను 'గగనపు వీధి' అని ప్రారంభించాను. ఇందులో చాలా పదాలు అందరికీ తెలిసినవే కానీ ఎవరూ అంతగా వాడరు. నగము, నర్తనశౌరి అనే పదాలు మాత్రం కొంతమందికి తెలియక వాటి అర్థమేంటి అని ఫోన్లు చేసి అడిగారు. రెండు నెలల పాటు à°ˆ పాటపై వర్క్‌ చేశాను. à°ˆ పాటలో సాకీ ఉంటుంది. పల్లవి ఉంటుంది. à°“ హుక్‌లైన్‌ ఉంటుంది. దీన్నొక ప్రయోగంలా చేశాం. à°ˆ పాటలో సాకీని - కార్తికేయన్‌ పాడారు. మిగిలిన పాటను విజయప్రకాష్‌ పాడారు. 
 
గగనపు వీధి వీడి వలస వెళ్లిపోయిన నీలిమబ్బు కోసం 
తరలింది తనకు తానే ఆకాశం.. పరదేశం 
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటిచుక్క కోసం 
విడిచింది చూడు నగమే తన వాసం.. వనవాసం 
 
ఇక్కడ నగమంటే కొండ అని అర్థం. నిజానికి నగం అన్నచోట శిఖరం వాడవచ్చు కానీ వాడిన పదాన్ని మళ్లీ వాడకుండా ఉండాలని కొండ, శైలం, à°—à°¿à°°à°¿, నగం ఇలా కొన్నిపేర్లు సూచిస్తే త్రివిక్రమ్‌ గారు నగం 
 
పదాన్ని సెలెక్ట్‌ చేశారు. 
నడిచొచ్చే నర్తనశౌరి 
పరిగెత్తే పరాక్రమ శైలి 
హాలాహలం ధరించిన దగ్ధ హృదయుడో.. 
 
ఇందులో నర్తనశౌరి అంటే నర్తించే కృష్ణుడు అని అర్థం. కాళింది మర్దనం సందర్భంగా à°ˆ పేరు వచ్చింది. కథానాయకుడికి సరిగ్గా సరిపోయే పదం అని అది వాడాను. తర్వాత ‘దగ్ధ హృదయుడో’ అనే ప్రయోగం చేశాను. అది కూడా చాలామందికి నచ్చింది. పాట చరణాల్లో కథా నేపథ్యాన్ని పరిచయం చేశాను. à°ˆ పాట రాయడం à°“ గొప్ప పాఠంలా అనిపించింది. నేపథ్యంలో వచ్చే పాటలు ఎలా ఉండాలనే దాని గురించి చాలా నేర్చుకున్నాను. దేవిశ్రీగారికి నేను ఎప్పుడు పాటలు రాసినా చాలా వెర్షన్స్‌ రాసుకెళతాను. ఎందుకంటే à°ˆ ఎక్స్‌ప్రెషన్‌ బానే ఉంది కదా, అదే ఉంచేద్దాం అనే ఆలోచన ఆయనకుండదు. ఎప్పుడూ బెస్ట్‌ కోరుకుంటారు. ఆయనతో పనిచేస్తుంటే స్నేహితులతో సాయంత్రం పూట కబుర్లు చెప్పుకుంటున్నట్టో, టీకొట్టు దగ్గర బాతాఖానీ చేస్తున్నట్లో ఉంటుంది. ఆయన ఎన్నో విషయాలు చెబుతారు. à°† మాటల్లోనే ఎన్నో విషయాలు నేర్పుతారు కూడా!