This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...

చిరస్మరణీయుడు, స్వరస్మరణీయుడు, తెరస్మరణీయుడు

                                                    ఆత్రేయ    
  
తెలుగు సినీ సాహిత్య చరిత్రలో భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకేట్టు చేయడంలో ఆత్రేయ స్థానం అనితర సాధ్యం. భాష చేత భావాలకు ఆయన ఎప్పుడూ వెట్టిచాకిరీ చేయించుకోలేదు. అయినా పదాలు ఆయన చేతిలో అతి అందంగా అమరిపోయాయి. ఒదిగిపోయాయి. ఒదుగు, ఒడుపు, జగి జిలుగులతో అతి చాకచక్యంగా పట్టుకోవడంలోనూఆకట్టుకోవడంలోనూ ఆయన సిద్దహస్తుడే కాదు, ప్రసిద్ధ హస్తుడు కూడా.                                                                        à°®à±à°–్యంగా మనిషి, మనసు, మమత, దేవుడు, విధి మీద రకరకాల ప్రయోగాలతో ఆత్రేయ రాసినన్ని పాటలు మరొకరు రాయలేదు.
మచ్చుకి-
పశువుల కన్నా పక్షుల కన్నా మనషిని మిన్నగ చేశాడు.
బుద్దిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు.
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధే రాక
నరుడే ఈ లోకం నరకం చేశాడు.
(దేవుడనేవాడున్నాడా - 'దాడుగుమూతలు')
మహాత్ములైనా దురాత్ములైనా మనుజుల పేరనే మసలేరయ్యా.
అందరికీ నీ అభయం కలదని అనుకోమందువా దేవా
(వెలుగు చూపవయ్యా - 'వాగ్దానం')
మనిషిని దైవానికి ఏనాటి నుంచో వైరము
వీడి కోరికవాడు తీర్చడు వాడి దారికి వీడు వెళ్ళడు
(మనసులేని దేవుడు -'ప్రేమలు-పెళ్ళిళ్ళు')
ఒకడి ఆకలికి అంబలి నీళ్ళు ఒకరికి పాలు పళ్ళు
భలేభలేగా దగాల దేవుడ బాగా పంచేవు
కోతికి బాబనిపించేవు ఓ బ్రహ్మయ్య
నీ లీలలే గడబిడ ఎడపెడ నీ గడాబిడా మా కెడాపెడా
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')
ఇక మనుషుల తత్వాల గురించి:
తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
(దేవుడునే వాడున్నాడా - 'దాగుడుమూతలు')
మాటలలో చిక్కుపడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతిగుండె బాధతో నిండినది
ఒలికే ప్రతి కన్నీటికి చుక్క వెచ్చగా ఉంటుంది
(బ్రతుకు పూలబాట కాదు - 'భార్యాబిడ్డలు')
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి
(నేను పుట్టాను - 'ప్రేమ్ à°¨à°—ర్')
మంచివాడికి, చెడ్డవాడికి తేడా ఒకటే బాబూ
మంచివాడు మనసున అనుకుంటాడు చెడ్డవాడు చేసే చూస్తాడు
(మనిషి మనిషికి తేడా ఉంది - 'పాప కోసం')
ఇక మనసు గురించి ఆత్రేయ మధన పడ్డంతగా మరొకరు కనిపించరు మనకి. ఒకటా... రెండా... ఎన్నో....ఎన్నెన్నో... ఒక్క క్షణం మనసుకి మాటలు తడితే జలజల జాలువారిపోతాయి ఆయన పాటలు.
ఒకరికిస్తే మరలిరాదు, ఓడిపోతే మరచిపోదు.
గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకుపడదు.
(మనసుగతి ఇంతే - 'ప్రేమ్ నగర్')
ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే
లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు
à°’à°• పొరపాటుకు  యుగములు పొగిలేవు
(మౌనమే నీ భాష - 'గుప్పెడు మనుసు')
వలచుట తెలిపిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా
(నీ సుఖమే నే కోరుతున్నా - 'మురళీకృష్ణ')
కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం
(మనసు లేని బ్రతుకొక నరకం - 'సెక్రటరీ')
వయసు కోతి వంటిదీయ మనసు కొమ్మ వంటిదీ
ఊపేసి పోతుంది మొదటిదీ,
ఆ ఊపు మరువనంటుంది రెండవది
(వయసు కోతి వంటిదీ - 'అగ్నిపూలు')
తనువుకు ప్రాణం కాపలా - మనిషికి మనసే కాపలా
ఎవరి ప్రేమకు నోచని నాడు కన్నీరేరా నీకు కాపలా
(ఎవరికి ఎవరు కాపలా - 'ఇంటికి దీపం ఇల్లాలే')
మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
(ఎవరో జ్వాలను రగిలించారు - 'డాక్టర్ చక్రవర్తి')
మనసు మూగదే కానీ బాసుంటది దానికి
చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ
(ముద్దబంతిపూవులో - 'మూగమనసులు')
మడిసితోటి ఏలాకోలం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా
(మాను మాకును కాను - 'మూగమనసులు')
వయసు పెరిగినా మనిషి ఎదిగినా
మనసు ముదరనంత వరకు మాసిపోదు పసితనం
(వయసు పెరిగినా - 'ప్రాణమిత్రులు')
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదూ
మోడు కూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
(అటు ఇటు కాని - 'ఇది కథకాదు')
విధి, సమాజం, ఖర్మ, బలహీనతలు వీటి పోకడల మీద ఆత్రేయ ఎన్నో విసుర్లు విసిరాడు. ఒక్కోసారి విరుచుకు పడ్డాడు. మరోసారి విజ్ఞత తెలియజెప్పాడు. అయితే ప్రతిసారీ బాధ్యతను గుర్తు చేశాడు. ఎలా అంటే -
కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ
గనులూ తొలిచీ చెమట చలువను చేర్చిరాళ్ళను తీర్చినారు తెలుసుకో.
(కారులో షికారుకెళ్ళే - 'తోడికోడళ్ళు')
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
(నీ సుఖమే నేను కోరుతున్నా - 'మురళీకృష్ణ')
ఇరవైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా?
(సిగలోకి విరులిచ్చి - 'సుమంగళి')
కళా జీవితం లక్కు à°’à°• ట్రిక్కు  à°’à°•à°°à°¿à°•à°¿ లక్కు - à°’à°•à°°à°¿à°•à°¿ ట్రిక్కు
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
(రాయిని ఆడది చేసిన - 'త్రిశూలం')
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా
(సాపాటు ఎటూ లేదు - 'ఆకలిరాజ్యం')
పిచ్చిపిచ్చిపిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకంటే అది అచ్చమైన పిచ్చీ
(పిచ్చిపిచ్చిపిచ్చీ - ’పండంటి సంసారం')
రాతి అందాలన్నీ నాతిలో చెక్కి
తీరని కోర్కెలే తీర్చుకున్నాడేమో
(ఆనాటి మానవుడు - 'సుమంగళి')
ప్రేమనేది ఉన్నదా
అది మానవులకే ఉన్నదా
హృదయముంటే తప్పదా
అది బ్రతుకు కన్నా గొప్పదా
(మనసులేని దేవుడు - 'ప్రేమలు - పెళ్ళిళ్ళు')
కర్మను నమ్మినవారెవరూ కలిమిని స్థిరమనుకోరు, కళ్ళు మూసుకోరు.
కావాలని నిప్పు తాకితే చేయి కాలక మానదు
అలా కాలినందుకు ఖర్మే అంటే గాయమేమీ మానదు.
(కనబడని చెయ్యి ఏదో - 'తాశిల్దారుగారమ్మాయి')
ప్రేమ, పెళ్ళి, రెండు హృదయాల పరస్పర స్పందనపై - ఆత్రేయ అందించిన అనుభూతి తల్చుకున్నప్పుడల్లా మనసు అట్టడగు అంచులు కూడా పులకరించిపోతాయి.
నీ వలపు వాన కురిసి కురిసి తడిసి పోనీ
తడియారని హృదిలో నను మొలకలెత్తనీ
(తెల్లవారనీకు ఈ రేయినీ - 'ఆత్మబలం')
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
(చిటపటచినుకులు - 'ఆత్మబలం')
పెమిదను తెచ్చి ఒత్తిని యేసి చమురును పోసి బెమసూసేవా
ఇంతా చేసి ఎలిగించేందుకు ఎనక ముందూలాడేవా