Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
SrISrI 'mahAprasthAnaM'lOni 'AnaMdaM aravNamaitE' gEyAnni I citraM kOsaM pATagA malucukunnAru. suSIla pADina I pATanu sAvitri pradhAna pAtradhAriNigA aBinayiMciMdi. SaMkarABaraNaMlOni svarAlanu skElugA tIsukuni akkaDakkaDa prati madhyamAnni (ma anE svaraMlO) kaiSika niShAdAnni (ni anE svaraMlO) kUDA upayOgistU pATanu svaraparicAru GaMTasAla.
శ్రీశ్రీ 'మహాప్రస్థానం'లోని 'ఆనందం అరవ్ణమైతే' గేయాన్ని ఈ చిత్రం కోసం పాటగా మలుచుకున్నారు. సుశీల పాడిన ఈ పాటను సావిత్రి ప్రధాన పాత్రధారిణిగా అభినయించింది. శంకరాభరణంలోని స్వరాలను స్కేలుగా తీసుకుని అక్కడక్కడ ప్రతి మధ్యమాన్ని (మ అనే స్వరంలో) కైశిక నిషాదాన్ని (ని అనే స్వరంలో) కూడా ఉపయోగిస్తూ పాటను స్వరపరిచారు ఘంటసాల.
గేయాన్ని గీతంగా మలచటంలో కొన్ని ఇబ్బందులున్నాయి. అందులోను బహుళ ప్రచారంలో ఉన్న గేయమైతే అవి ఇంకా జటిలం అవుతాయి. వాటన్నిటినీ ఘంటసాల ఎలా అధిగమించారో ఈ ట్యూన్ ని నాలుగైదు సార్లు వింటే తెలుస్తుంది. ఇదొక ఎత్తు ఖంగుమంటూ మ్రోగే సుశీల గొంతులోని ఫ్రెష్నెస్ ఒక ఎత్తు.