Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,
Lyrics Writer : Anisetti / అని శెట్టి , Kosaraaju / కొసరాజు , Sri sri / శ్రీ శ్రీ ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
I pATanu pi.lIla pADagA aMjalIdEvi pradhAna pAtradhAriNigA aBinayiMciMdi. amIr kaLyANi, bEhAg, kaLyANi rAgacCAyalalO I gItaM svaraparacabaDiMdi. sinI BaktigItAlalO cAlAvATini kAlAniki edurIdi nilabaDagaligE Sakti unnA konni caraNAlu AyA sinimAlaku, pAtralaku saMbaMdhiMci uMDaDaM sahajaM. udAharaNaki 'sItArAma kaLyANaM' sinimAlO 'jagadEka mAtA gauri' pATanu pArvatI dEviki saMbaMdhiMcina pUjA samayAlalO cAlAmaMdi pEraMTALLu mottaM sAhityaMtO sahA pADutuMTAru.
aMdulO 'nA patikApada kaluganIyaka' anna lainu pADukunE AviDa Barta ApadalO unnA lEkapOyinA cellipOtuMdi. gAni 'nI padamulanu laMkApatini nA pennidhigA nammukuMTini' anna lainu arthaM telusukuni pADitE ibbaMdigA uMTuMdi. iTuvaMTi ibbaMdini kalugajEyakuMDA E kAlaMlO evaru pADukunnA cakkagA uMDE pATala kOvalOki 'janagaNa maMgaLadAyaka rAmaM' pATa ceMdutuMdi.
ఈ పాటను పి.లీల పాడగా అంజలీదేవి ప్రధాన పాత్రధారిణిగా అభినయించింది. అమీర్ కళ్యాణి, బేహాగ్, కళ్యాణి రాగచ్ఛాయలలో ఈ గీతం స్వరపరచబడింది. సినీ భక్తిగీతాలలో చాలావాటిని కాలానికి ఎదురీది నిలబడగలిగే శక్తి ఉన్నా కొన్ని చరణాలు ఆయా సినిమాలకు, పాత్రలకు సంబంధించి ఉండడం సహజం. ఉదాహరణకి 'సీతారామ కళ్యాణం' సినిమాలో 'జగదేక మాతా గౌరి' పాటను పార్వతీ దేవికి సంబంధించిన పూజా సమయాలలో చాలామంది పేరంటాళ్ళు మొత్తం సాహిత్యంతో సహా పాడుతుంటారు.
అందులో 'నా పతికాపద కలుగనీయక' అన్న లైను పాడుకునే ఆవిడ భర్త ఆపదలో ఉన్నా లేకపోయినా చెల్లిపోతుంది. గాని 'నీ పదములను లంకాపతిని నా పెన్నిధిగా నమ్ముకుంటిని' అన్న లైను అర్థం తెలుసుకుని పాడితే ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందిని కలుగజేయకుండా ఏ కాలంలో ఎవరు పాడుకున్నా చక్కగా ఉండే పాటల కోవలోకి 'జనగణ మంగళదాయక రామం' పాట చెందుతుంది.