This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Vipranarayana
Song » Saa virahe tava denaa / సా విరహే తవ దీనా
Click To Rate




* Voting Result *
25.00 %
12.50 %
0 %
0 %
62.50 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu BAnumati AlapiMcagA akkinEni nAgESvararAvu, BAnumatipai citrIkariMcAru. panneMDava SatAbdAniki ceMdina jayadEva mahAkavi rAsina gItagOviMdaMlOni I aShTapadiki yas.rAjESvararAvu cEsina svarakalpana Ayana saMgIta jaitrayAtralO O madhuramaina majilIgA ceppukOka tappadu. 'vipranArAyaNa ' citraM viDudalaku muMdu I gItAnni teluguvAru elA gurtuMcukunEvarO kAnI taruvAta nuMcI evaru eppuDu udahariMcavalasi vaccinA rAjESvararAvu cEsina varasa ASrayiMcaTaM tappa gatyaMtaraM lEdanE anipistuMdi.


yaman kaLyANi rAgaMlO rAjESvararAvu cEsina pATalannI A rAgaMlOni sArAnnaMtA eppaTikappuDu tEnelUrutU aMdistUnE unnAyi. A pATala varusalO agrasdhAnaMlO uMcadagga gItamidi. I pATalO PlUT ni, havAyin giTArni Ayana upayOgiMcina tIru A rAgaM painA, AyA vAdyAla painA Ayanakunna paTTuni paTTistAyi. muKyaMgA 'tava caraNEpati tAhaM ' anE padaM taruvAta vaccE PlUT biT. caraNAla madhya vaccE iMTarlUD latO pATu gItAniki AdyaMtamE kAka Adi aMtAlalO kUDA vinipiMcE havAyin giTAr biTlu - ivannI madhura lOkAlaku tIsukupOyE meTlu.

ika I pATanu BAnumati pADina tIru anyulaku asAdhyamanE anipistuMdi. vErokari gaLaMlO I pATanu viMTE BAnumatipai gauravaM iMkA inumaDistuMdi. EkaMgA BAnumati pADina pATanE ganaka viMTE aMtaTi goppa jilugulanu aMdiMcagala kaMThaM AmekunnaMduku, vATini aMdukOgala cevi manakunnaMduku muccaTEstuMdi. pATaku muMdunA, civarnA vaccE ' tana virahE dInA' daggara 'dI....nA' aMTU ame tana svaraM dvArA cUpina 'aps aMD Dauns ' na BUtO ani ceppaka tappadu.

( I pATa AlApana modalu kAgAnE 'eMta bAgA pADEvu dEvI' aMTADu vipranArAyaNuDu. dAniki dEvadEvi - 'jayadEva kavi kavitvamE aMta svAmI' - aMTuMdi. nijAniki jayadEvuDu 12va SatAbdaM vADu. vipranArAyaNuDu 8va SatAbdaM vADu. 12va SatAbdaMlO rAsina kavitvAnni 8va SatAbdaMlO elA pADaDaM jarugutuMdi ?I pATaku saMbaMdhiMcina apaSruti idokkaTE.)




Important information - Telugu

 ఈ పాటను భానుమతి ఆలపించగా అక్కినేని నాగేశ్వరరావు, భానుమతిపై చిత్రీకరించారు. పన్నెండవ శతాబ్దానికి చెందిన జయదేవ మహాకవి రాసిన గీతగోవిందంలోని ఈ అష్టపదికి యస్.రాజేశ్వరరావు చేసిన స్వరకల్పన ఆయన సంగీత జైత్రయాత్రలో ఓ మధురమైన మజిలీగా చెప్పుకోక తప్పదు. 'విప్రనారాయణ ' చిత్రం విడుదలకు ముందు ఈ గీతాన్ని తెలుగువారు ఎలా గుర్తుంచుకునేవరో కానీ తరువాత నుంచీ ఎవరు ఎప్పుడు ఉదహరించవలసి వచ్చినా రాజేశ్వరరావు చేసిన వరస ఆశ్రయించటం తప్ప గత్యంతరం లేదనే అనిపిస్తుంది. యమన్ కళ్యాణి రాగంలో రాజేశ్వరరావు చేసిన పాటలన్నీ ఆ రాగంలోని సారాన్నంతా ఎప్పటికప్పుడు తేనెలూరుతూ అందిస్తూనే ఉన్నాయి. ఆ పాటల వరుసలో అగ్రస్ధానంలో ఉంచదగ్గ గీతమిది. ఈ పాటలో ఫ్లూట్ ని, హవాయిన్ గిటార్ని ఆయన ఉపయోగించిన తీరు ఆ రాగం పైనా, ఆయా వాద్యాల పైనా ఆయనకున్న పట్టుని పట్టిస్తాయి. ముఖ్యంగా 'తవ చరణేపతి తాహం ' అనే పదం తరువాత వచ్చే ఫ్లూట్ బిట్. చరణాల మధ్య వచ్చే ఇంటర్లూడ్ లతో పాటు గీతానికి ఆద్యంతమే కాక ఆది అంతాలలో కూడా వినిపించే హవాయిన్ గిటార్ బిట్లు - ఇవన్నీ మధుర లోకాలకు తీసుకుపోయే మెట్లు. 

ఇక ఈ పాటను భానుమతి పాడిన తీరు అన్యులకు అసాధ్యమనే అనిపిస్తుంది. వేరొకరి గళంలో ఈ పాటను వింటే భానుమతిపై గౌరవం ఇంకా ఇనుమడిస్తుంది. ఏకంగా భానుమతి పాడిన పాటనే గనక వింటే అంతటి గొప్ప జిలుగులను అందించగల కంఠం ఆమెకున్నందుకు, వాటిని అందుకోగల చెవి మనకున్నందుకు ముచ్చటేస్తుంది. పాటకు ముందునా, చివర్నా వచ్చే ' తన విరహే దీనా' దగ్గర 'దీ....నా' అంటూ అమె తన స్వరం ద్వారా చూపిన 'అప్స్ అండ్ డౌన్స్ ' న భూతో అని చెప్పక తప్పదు. 
( ఈ పాట ఆలాపన మొదలు కాగానే 'ఎంత బాగా పాడేవు దేవీ' అంటాడు విప్రనారాయణుడు. దానికి దేవదేవి - 'జయదేవ కవి కవిత్వమే అంత స్వామీ' - అంటుంది. నిజానికి జయదేవుడు 12వ శతాబ్దం వాడు. విప్రనారాయణుడు 8వ శతాబ్దం వాడు. 12వ శతాబ్దంలో రాసిన కవిత్వాన్ని 8వ శతాబ్దంలో ఎలా పాడడం జరుగుతుంది ?ఈ పాటకు సంబంధించిన అపశ్రుతి ఇదొక్కటే.)

రాజా
డిటిపి కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ