Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Devotional Songs
Song- Ragam :
suSIla bRuMdaMtO kalisi pADina I pATani teluguvAri saMpradAya jIvanaMpai aKaMDa vijayAnni sAdhiMcina pATagA ceppukOvaccu. telugu vAriMTa I pATalEni peLLi paMdiri lEdu. eMta kaShTamainA sarE I pATanu teppiMci upayOgiMcAlsiMdE. lEkuMTE adi aSuBamEmOnanna seMTimeMT kUDA konni konni grAmAlalO uMdi. 'padikoMpalu lEni pallenainanu rAmaBajana maMdiramoMDu varalu gAta' annaTTu I pATa lEni rAmuni kOvale kUDA AMdhradESaMlO lEdanE ceppAli. pUrtigA madhyamAvati rAgaMpai sAgina I pATalO 'ANimutyamulu talaMbrAlugA Siramula merasina sItArAmula kaLyANamu cUtamu rAraMDi' taruvAta vAdya saMgItaMlO vaccE 'AnaMdamAnaMdamAyenE' okkaTE AnaMdaBairavi rAgaMlO uMTuMdi. sItArAmula pAtralanu dhariMcina gItAMjali, haranAdh paina pradhAnaMgAnu, citraMlO gala migilina pAtradhArulaMdari paina avasaramaina mEraku I pATanu citrIkariMcAru.
సుశీల బృందంతో కలిసి పాడిన ఈ పాటని తెలుగువారి సంప్రదాయ జీవనంపై అఖండ విజయాన్ని సాధించిన పాటగా చెప్పుకోవచ్చు. తెలుగు వారింట ఈ పాటలేని పెళ్ళి పందిరి లేదు. ఎంత కష్టమైనా సరే ఈ పాటను తెప్పించి ఉపయోగించాల్సిందే. లేకుంటే అది అశుభమేమోనన్న సెంటిమెంట్ కూడా కొన్ని కొన్ని గ్రామాలలో ఉంది. 'పదికొంపలు లేని పల్లెనైనను రామభజన మందిరమొండు వరలు గాత' అన్నట్టు ఈ పాట లేని రాముని కోవలె కూడా ఆంధ్రదేశంలో లేదనే చెప్పాలి. పూర్తిగా మధ్యమావతి రాగంపై సాగిన ఈ పాటలో 'ఆణిముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల కళ్యాణము చూతము రారండి' తరువాత వాద్య సంగీతంలో వచ్చే 'ఆనందమానందమాయెనే' ఒక్కటే ఆనందభైరవి రాగంలో ఉంటుంది. సీతారాముల పాత్రలను ధరించిన గీతాంజలి, హరనాధ్ పైన ప్రధానంగాను, చిత్రంలో గల మిగిలిన పాత్రధారులందరి పైన అవసరమైన మేరకు ఈ పాటను చిత్రీకరించారు.