Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla gAnaM cEyagA en.Ti.Ar pradhAna pAtradhArigA aBinayiMcAru. I pATalO samudrAla upayOgiMcina ennO padAlu, upamAnAlalO - kannaDa sEyaka (upEkShiMcaka), kaMdarpa darSaBaMga (manmadhuniki garvaBaMgaM cEsina vADu), vyOmakESa (AkASamE kESamulugA kalavADu) vaMTi prayOgAlu BaktigItAlalO ati arudugA kanipistAyi. SaMkarABaraNa rAgAniki sadupamAnaMgA nilicipOyE I gItAniki japaM, jIvaM annI GaMTasAlE...! pratI padaM yokka arthAnni samarthaMgA terapai AviShkariMcagaligE naTuDu uMTE vATi paramArthaM saMpUrNaMgA telisina gAyakuDu eMtagA prANa pratiShTa cEsi pADagalaDO nirUpiMcE pATa idi. I pATanu sAkalyaMgA cEsi iMTarlUDstO sahA manasulO SASvataMgA nilupukOgaligina vArevarainA SaMkarABaraNa rAgaMpai koMta paTTuni sAdhiMcagaligAnani ceppukOvaccu, eMdukaMTE I pATalO SaMkarABaraNa rAgaMtO pATu A rAgaMlOni janyarAgAla naDakaku saMbaMdhiMcina prayOgAlannI jarigAyi kAbaTTi!
ఈ పాటను ఘంటసాల గానం చేయగా ఎన్.టి.ఆర్ ప్రధాన పాత్రధారిగా అభినయించారు. ఈ పాటలో సముద్రాల ఉపయోగించిన ఎన్నో పదాలు, ఉపమానాలలో - కన్నడ సేయక (ఉపేక్షించక), కందర్ప దర్శభంగ (మన్మధునికి గర్వభంగం చేసిన వాడు), వ్యోమకేశ (ఆకాశమే కేశములుగా కలవాడు) వంటి ప్రయోగాలు భక్తిగీతాలలో అతి అరుదుగా కనిపిస్తాయి. శంకరాభరణ రాగానికి సదుపమానంగా నిలిచిపోయే ఈ గీతానికి జపం, జీవం అన్నీ ఘంటసాలే...! ప్రతీ పదం యొక్క అర్థాన్ని సమర్థంగా తెరపై ఆవిష్కరించగలిగే నటుడు ఉంటే వాటి పరమార్థం సంపూర్ణంగా తెలిసిన గాయకుడు ఎంతగా ప్రాణ ప్రతిష్ట చేసి పాడగలడో నిరూపించే పాట ఇది. ఈ పాటను సాకల్యంగా చేసి ఇంటర్లూడ్స్తో సహా మనసులో శాశ్వతంగా నిలుపుకోగలిగిన వారెవరైనా శంకరాభరణ రాగంపై కొంత పట్టుని సాధించగలిగానని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ పాటలో శంకరాభరణ రాగంతో పాటు ఆ రాగంలోని జన్యరాగాల నడకకు సంబంధించిన ప్రయోగాలన్నీ జరిగాయి కాబట్టి!