Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Gali Penchala Narasimha Rao / గాలి పెంచెలనరసింహా రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu suSIla gAyaM cEyagA gItAMjali (appaTlO pEru maNi), bi. sarOjAdEvi aBinayiMcAru. I pATaku sAraMga rAgaM AdhAraM. konni konni pATalu sinimA rUpENA vaccinA tarvAta mana saMpradAyaMlO avi kUDA O BAgamai pOvaTaM jarigiMdi. aTuvaMTi pATalalO I pATanu pErkonAli. strIla paMDagalaku, pUjalaku saMbaMdhiMcina pEraMTAlalO InATikI I pATanu yathAtathaMgA pADaTaM jarugutOMdi. A saMpradAyaM eMta paTiShTaMgA konasAgutOMdaMTE arthAnni kUDA paTTiMcukOkuMDA tu.ca tappakuMDA pADaTaM manaM cAlA iLLallO gamaniMcavaccu. muKyaMgA reMDava caraNaMlO vaccE 'nI padamulanu, laMkApatini nA pennidhigA nammukuMTinE' anE vAkyAnni alA yathAtathaMgA pADitE marI anucitaMgA uMTuMdanna saMgati kUDA manavALLa manasulaku taTTaTaM lEdaMTE A tarvAta vaccE 'nA patikApada kaluganIyaka kApADagadE maMgaLa gaurI' anE vAkyAla praBAvaMlOnU, pravAhaMlOnU eMtagA munigipOtunnArO gamaniMcAli. adi okavidhaMgA pATa sAdhiMcina vijayamE.
ఈ పాటను సుశీల గాయం చేయగా గీతాంజలి (అప్పట్లో పేరు మణి), బి. సరోజాదేవి అభినయించారు. ఈ పాటకు సారంగ రాగం ఆధారం. కొన్ని కొన్ని పాటలు సినిమా రూపేణా వచ్చినా తర్వాత మన సంప్రదాయంలో అవి కూడా ఓ భాగమై పోవటం జరిగింది. అటువంటి పాటలలో ఈ పాటను పేర్కొనాలి. స్త్రీల పండగలకు, పూజలకు సంబంధించిన పేరంటాలలో ఈనాటికీ ఈ పాటను యథాతథంగా పాడటం జరుగుతోంది. ఆ సంప్రదాయం ఎంత పటిష్టంగా కొనసాగుతోందంటే అర్థాన్ని కూడా పట్టించుకోకుండా తు.చ తప్పకుండా పాడటం మనం చాలా ఇళ్ళల్లో గమనించవచ్చు. ముఖ్యంగా రెండవ చరణంలో వచ్చే 'నీ పదములను, లంకాపతిని నా పెన్నిధిగా నమ్ముకుంటినే' అనే వాక్యాన్ని అలా యథాతథంగా పాడితే మరీ అనుచితంగా ఉంటుందన్న సంగతి కూడా మనవాళ్ళ మనసులకు తట్టటం లేదంటే ఆ తర్వాత వచ్చే 'నా పతికాపద కలుగనీయక కాపాడగదే మంగళ గౌరీ' అనే వాక్యాల ప్రభావంలోనూ, ప్రవాహంలోనూ ఎంతగా మునిగిపోతున్నారో గమనించాలి. అది ఒకవిధంగా పాట సాధించిన విజయమే.