Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Bhanumathi / భానుమతి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,
Song Category : Others
Song- Ragam :
I pATaku gAnaM, aBinayaM SrImati BAnumatE! sannivESa prAdhAnyaMgA naTuDu sIniyar E.vI.subbArAvu kUDA pATa civarlO kanipistAru. I pATa kaLyANi rAgaMtO svaraparacabaDiMdi. akkaDakkaDa yaman kUDA toMgi cUstU uMTuMdi. saMgItAniki saMbaMdhiMcinaMtavarakU I pATa svarakalpana oka ettu, gAnaM okkaTI oka ettu. eMdukaMTE kaLyANirAgaMlO svaraparacaTaMlO GaMTasAla gAriki tanakaMTU O Saili, mudra uMdi. rAvE celiyA (maMcimanasuku maMcirOjulu), virise callani vennela (lava-kuSa), talaniMDA pUdaMDa dAlcina rANi (praivET sAMg), pATalanu kUlaMkaShaMgA madhiMcina vAriki A Saili, mudra manOgatamai pOtU uMTuMdi. alAgE kaLyANi rAgaMlO gala pATalanu pADaTaMlO BAnumatiki vilakShaNamaina paMdhA uMdi. A reMDu rItulanu kalagalapukunna pATa idi. marOvidhaMgA ceppAlaMTE - I pATanu ganuka sAdhana cEsi yathAtathaMgA pADagaliginavAriki kaLyANirAgaMpai maMcipaTTu laBistuMdi.
ఈ పాటకు గానం, అభినయం శ్రీమతి భానుమతే! సన్నివేశ ప్రాధాన్యంగా నటుడు సీనియర్ ఏ.వీ.సుబ్బారావు కూడా పాట చివర్లో కనిపిస్తారు. ఈ పాట కళ్యాణి రాగంతో స్వరపరచబడింది. అక్కడక్కడ యమన్ కూడా తొంగి చూస్తూ ఉంటుంది. సంగీతానికి సంబంధించినంతవరకూ ఈ పాట స్వరకల్పన ఒక ఎత్తు, గానం ఒక్కటీ ఒక ఎత్తు. ఎందుకంటే కళ్యాణిరాగంలో స్వరపరచటంలో ఘంటసాల గారికి తనకంటూ ఓ శైలి, ముద్ర ఉంది. రావే చెలియా (మంచిమనసుకు మంచిరోజులు), విరిసె చల్లని వెన్నెల (లవ-కుశ), తలనిండా పూదండ దాల్చిన రాణి (ప్రైవేట్ సాంగ్), పాటలను కూలంకషంగా మధించిన వారికి ఆ శైలి, ముద్ర మనోగతమై పోతూ ఉంటుంది. అలాగే కళ్యాణి రాగంలో గల పాటలను పాడటంలో భానుమతికి విలక్షణమైన పంధా ఉంది. ఆ రెండు రీతులను కలగలపుకున్న పాట ఇది. మరోవిధంగా చెప్పాలంటే - ఈ పాటను గనుక సాధన చేసి యథాతథంగా పాడగలిగినవారికి కళ్యాణిరాగంపై మంచిపట్టు లభిస్తుంది.