This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Devadaasu
Song » Tane Marina / తానే మారినా
Click To Rate




* Voting Result *
18.18 %
0 %
0 %
0 %
81.82 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu rAvu bAla sarasvati dEvi pADagA caMdramuKi pAtranu dhariMcina lalita aBinayiMcAru. rAjkapUr tIsina 'jis dESmE gaMgA behatI hai' sinimA hIrOyin ayina padminiki svayAna akkagA, nETi pramuKa naTi SOBanaku mEnattagA paricayaM cEstEnE lalita aMTE evarO I taraM vAriki kUDA arthaM avutuMdi.


saMgItaparaMgA I pATalO ceppukOdagga viShayAlu konni unnAyi. kaLyANi rAgAnni miSramaM cEsi vADukunnArI pATalO. modaTi caraNaMlO gala 'mA celimi kalalO pennidhAnamA' daggara, reMDava caraNaMlO gala 'nAkidE kaDasAri dariSanamA' daggara vaccE alApanalanu - 'kuDI eDamaitE porapATu lEdOy' pATalO 'suDilO dUkI edurIdakA' tarvAta AlApanatO pOlcukuni cUDaMDi. reMDU okkalAgE uMTAyi. alAgE iMkA jAgattagA gamanistE.... 'palleku pOdAM pAruni cUdAM' pATanu pADukuMTU A pATalO 'suDilO dUkI edurIdakA' tarvAta AlApanatO pOlcukuni cUDaMDi. reMDU okkalAgE uMTAyi. alAgE iMkA jAgrattagA gamanistE... 'palleku pOdAM pAruni cUdAM' pATanu pADukuMTU A pATalO vaccE 'kanulAra cUtamu', 'EmaunO cUtamu' anE vAkyAlani TyUntO sahA minahAyiMcEsukuni dAniki 'dArI tennu lEnElEka I tArAyenA' lainuni TyUntO sahA kalupukuni pADukuni cUDaMDi. I 'tAnE mArenA' pATa elA ati cakkagA atikipOtuMdO telustuMdi.

paina udahariMcina pATalE kAka marO nAlugu maMci pATalu kUDA unnAyi 'dEvadAsu'lO. I sinimAlOni pATala sAhityAnni kShuNNaMgA vaMTabaTTiMcukuMTE - A avagAhana eTuvaMTi vArikainA tama jIvitakAlaMlO okkasArainA anuBavaMlOki rAkuMDA uMDadu. aMdukE vinOdA vAri 'dEvadAsu' telugu calanacitra caritralO ajAmaraMgA nilicipOyiMdi.

Important information - Telugu

ఈ పాటను రావు బాల సరస్వతి దేవి పాడగా చంద్రముఖి పాత్రను ధరించిన లలిత అభినయించారు. రాజ్కపూర్ తీసిన 'జిస్ దేశ్మే గంగా బెహతీ హై' సినిమా హీరోయిన్ అయిన పద్మినికి స్వయాన అక్కగా, నేటి ప్రముఖ నటి శోభనకు మేనత్తగా పరిచయం చేస్తేనే లలిత అంటే ఎవరో ఈ తరం వారికి కూడా అర్థం అవుతుంది.


సంగీతపరంగా ఈ పాటలో చెప్పుకోదగ్గ విషయాలు కొన్ని ఉన్నాయి. కళ్యాణి రాగాన్ని మిశ్రమం చేసి వాడుకున్నారీ పాటలో. మొదటి చరణంలో గల 'మా చెలిమి కలలో పెన్నిధానమా' దగ్గర, రెండవ చరణంలో గల 'నాకిదే కడసారి దరిశనమా' దగ్గర వచ్చే అలాపనలను - 'కుడీ ఎడమైతే పొరపాటు లేదోయ్' పాటలో 'సుడిలో దూకీ ఎదురీదకా' తర్వాత ఆలాపనతో పోల్చుకుని చూడండి. రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలాగే ఇంకా జాగత్తగా గమనిస్తే.... 'పల్లెకు పోదాం పారుని చూదాం' పాటను పాడుకుంటూ ఆ పాటలో 'సుడిలో దూకీ ఎదురీదకా' తర్వాత ఆలాపనతో పోల్చుకుని చూడండి. రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలాగే ఇంకా జాగ్రత్తగా గమనిస్తే... 'పల్లెకు పోదాం పారుని చూదాం' పాటను పాడుకుంటూ ఆ పాటలో వచ్చే 'కనులార చూతము', 'ఏమౌనో చూతము' అనే వాక్యాలని ట్యూన్తో సహా మినహాయించేసుకుని దానికి 'దారీ తెన్ను లేనేలేక ఈ తారాయెనా' లైనుని ట్యూన్తో సహా కలుపుకుని పాడుకుని చూడండి. ఈ 'తానే మారెనా' పాట ఎలా అతి చక్కగా అతికిపోతుందో తెలుస్తుంది.

పైన ఉదహరించిన పాటలే కాక మరో నాలుగు మంచి పాటలు కూడా ఉన్నాయి 'దేవదాసు'లో. ఈ సినిమాలోని పాటల సాహిత్యాన్ని క్షుణ్ణంగా వంటబట్టించుకుంటే - ఆ అవగాహన ఎటువంటి వారికైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా అనుభవంలోకి రాకుండా ఉండదు. అందుకే వినోదా వారి 'దేవదాసు' తెలుగు చలనచిత్ర చరిత్రలో అజామరంగా నిలిచిపోయింది.