This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Devadaasu
Song » Jagame maaya / జగమే మాయ
Click To Rate




* Voting Result *
9.52 %
0 %
0 %
0 %
90.48 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu GaMTasAla pADagA akkinEni nAgESvararAvu aBinayiMcAru. telugu calana citra saMgIta caritralOnu, teluguvAri jIvitAlalOnu SASvata sdhAnaM saMpAdiMcukunna pATa idi.  'dEvadAsu ' sinimAku muMdu elA vyavahariMcArO gAnI tAgi oLLu gulla cEsukunna vArini 'dEvadAsu ' ani pilavaTaM paripATigAnu, pIkaladAkA tAgina vADu saitaM aMta maikaM  lOnu 'jagamE mAya ' pATani AlapiMcaTaM O alavATugA mAripOyiMdi. aP kOrs... A tAgina vADu teluguvADaitEnE leMDi ...! janaMlOki I pATa naTanAparaMgA kUDA aMta  gADhaMgA mudra vEsukObaTTi, taruvAti rOjullO tana saMgIta kaccErIlu ekkaDa cEyavalasi vaccinA 'A daggu kUDA nAdE bAbU'' aMTU ceppukunEvAru GaMTasAla.  


konni konni viShayAlu vayasu periginakoddI, aMduku tagina anuBavAlu jIvitAniki jama avutunnakoddI, mariMta avagAhanatO avagatamavutU uMTAyi. dESakAlamAna  sdhitigatulaku atItamaina aTuvaMTi viShayAlalO I pATa sAhityaM kUDA okaTi. aMduku evari anuBavamE vAriki sAkShyaM. 'bAdhE sauKyamanE BAvana rAnIvOy / A erukE  niScalAnaMdamOy / brahmAnaMdamOy' anE vAkyAlani jIvitakAlaMlO okkasAraina nemaru vEsukOni teluguvADu uMDaDEmO bahuSA...! Edi Emaina 'jagamE mAya ' pATakuMDE  AyuH pramANaM iMkE pATakI lEdaMTE atiSayOkti kAdEmO. .!?

I sinimAku saMbaMdhiMcinaMta varakU saMgIta darSakuDu si.Ar.subbarAman guriMci koMta ceppukuni tIrAli. I citra nirmANaM sagaMlO uMDagA tana 29 va ETanE haThAnmaraNaM  ceMdina Ayana mRutipai rakarakAla UhAgAnAlunnAyi. eMdukaMTE Ayana 'vinOdA ' saMsdhalO vATAdAru kUDA. I nijAnni Ayana haThAnmaraNa saMGaTanaku jODiMci - vALLa madhya  vyApAra paramaina viBEdAlu vaccAyani, koMdaru kiTTani vALLu  cEsina viShaprayOgAniki Ayana balaipOyArani ceppukuMTU uMTAru. Ayanaku cinnatanaM nuMDE taracU PiTs  vaccEvi. A PiTsE Ayana guMDe mIda panicEsi Ayanni paralOkAniki tIsuku veLLipOyAyi. I viShayAnni pramuKa sinInaTuDu, racayita, nATaka karta ayina rAvi koMDalarAvu  vellaDiMcAru. oka jarnalisTugA patrikA nirvahaNa bAdhyatanu kUDA nirvartiMcAru ganuka Ayana mATalanu manaM viSvasiMcavaccu.

si.Ar.subbarAman ku asisTeMTugA vyavahariMcina  emmes viSvanAdhaM Ayana oppukunna citrAlanniTinI eMtO cittaSuddhitO, nijAyitI gala guruBaktitO - vayolins Ti.ke  .rAmamUrti sahAyaMtO pUrti cEsAru. A nATi A emmes viSvanAdhaM, Ti.ke.rAmamUrti kalisi darSakatvaM konnALLapATu 'viSvanAdhaM - rAmamUrti ' pEru mIda jaMTagA cAlA  citrAlaku saMgIta darSakatvaM vahiMcAru. 'dEvadAsu ' ki saMBaMdiMcinaMtavarakU - A sinimA rIrikArDiMg tO pATU ' iMta telisiyuMDi' anE jAvaLini,  'jagamE mAya ' pATanI  emmes viSvanAdhamE svaraparicAru.    


Important information - Telugu

ఈ పాటను ఘంటసాల పాడగా అక్కినేని నాగేశ్వరరావు అభినయించారు. తెలుగు చలన చిత్ర సంగీత చరిత్రలోను, తెలుగువారి జీవితాలలోను శాశ్వత స్ధానం సంపాదించుకున్న పాట ఇది. 'దేవదాసు ' సినిమాకు ముందు ఎలా వ్యవహరించారో గానీ తాగి ఒళ్ళు గుల్ల చేసుకున్న వారిని 'దేవదాసు ' అని పిలవటం పరిపాటిగాను, పీకలదాకా తాగిన వాడు సైతం అంత మైకం లోను 'జగమే మాయ ' పాటని ఆలపించటం ఓ అలవాటుగా మారిపోయింది. అఫ్ కోర్స్... ఆ తాగిన వాడు తెలుగువాడైతేనే లెండి ...! జనంలోకి ఈ పాట నటనాపరంగా కూడా అంత గాఢంగా ముద్ర వేసుకోబట్టి, తరువాతి రోజుల్లో తన సంగీత కచ్చేరీలు ఎక్కడ చేయవలసి వచ్చినా 'ఆ దగ్గు కూడా నాదే బాబూ'' అంటూ చెప్పుకునేవారు ఘంటసాల.   

కొన్ని కొన్ని విషయాలు వయసు పెరిగినకొద్దీ, అందుకు తగిన అనుభవాలు జీవితానికి జమ అవుతున్నకొద్దీ, మరింత అవగాహనతో అవగతమవుతూ ఉంటాయి. దేశకాలమాన స్ధితిగతులకు అతీతమైన అటువంటి విషయాలలో ఈ పాట సాహిత్యం కూడా ఒకటి. అందుకు ఎవరి అనుభవమే వారికి సాక్ష్యం. 'బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ / ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ / బ్రహ్మానందమోయ్' అనే వాక్యాలని జీవితకాలంలో ఒక్కసారైన నెమరు వేసుకోని తెలుగువాడు ఉండడేమో బహుశా...! ఏది ఏమైన 'జగమే మాయ ' పాటకుండే ఆయుః ప్రమాణం ఇంకే పాటకీ లేదంటే అతిశయోక్తి కాదేమో. .!?

ఈ సినిమాకు సంబంధించినంత వరకూ సంగీత దర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ గురించి కొంత చెప్పుకుని తీరాలి. ఈ చిత్ర నిర్మాణం సగంలో ఉండగా తన 29 వ ఏటనే హఠాన్మరణం చెందిన ఆయన మృతిపై రకరకాల ఊహాగానాలున్నాయి. ఎందుకంటే ఆయన 'వినోదా ' సంస్ధలో వాటాదారు కూడా. ఈ నిజాన్ని ఆయన హఠాన్మరణ సంఘటనకు జోడించి - వాళ్ళ మధ్య వ్యాపార పరమైన విభేదాలు వచ్చాయని, కొందరు కిట్టని వాళ్ళు  చేసిన విషప్రయోగానికి ఆయన బలైపోయారని చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు చిన్నతనం నుండే తరచూ ఫిట్స్ వచ్చేవి. ఆ ఫిట్సే ఆయన గుండె మీద పనిచేసి ఆయన్ని పరలోకానికి తీసుకు వెళ్ళిపోయాయి. ఈ విషయాన్ని ప్రముఖ సినీనటుడు, రచయిత, నాటక కర్త అయిన రావి కొండలరావు వెల్లడించారు. ఒక జర్నలిస్టుగా పత్రికా నిర్వహణ బాధ్యతను కూడా నిర్వర్తించారు గనుక ఆయన మాటలను మనం విశ్వసించవచ్చు.

సి.ఆర్.సుబ్బరామన్ కు అసిస్టెంటుగా వ్యవహరించిన  ఎమ్మెస్ విశ్వనాధం ఆయన ఒప్పుకున్న చిత్రాలన్నిటినీ ఎంతో చిత్తశుద్ధితో, నిజాయితీ గల గురుభక్తితో - వయొలిన్స్ టి.కె .రామమూర్తి సహాయంతో పూర్తి చేసారు. ఆ నాటి ఆ ఎమ్మెస్ విశ్వనాధం, టి.కె.రామమూర్తి కలిసి దర్శకత్వం కొన్నాళ్ళపాటు 'విశ్వనాధం - రామమూర్తి ' పేరు మీద జంటగా చాలా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 'దేవదాసు ' కి సంభందించినంతవరకూ - ఆ సినిమా రీరికార్డింగ్ తో పాటూ ' ఇంత తెలిసియుండి' అనే జావళిని,  'జగమే మాయ ' పాటనీ ఎమ్మెస్ విశ్వనాధమే స్వరపరిచారు.     
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ