Actor : Relangi(relangi venkatramayya) / రేలంగి (రేలంగి వెంకటరామయ్య) ,
Actress :
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) , Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం ,
Song Category : Phylosophical Songs
Song- Ragam :
'cilakanna cilakavE' guriMci ceppAlaMTE cAlA uMdi. kathAparaMgA - vilan kuyukti valana sAmaMtarAju daggara baMdIgA paDunna hIrO jADa telusukOvaTAniki atani snEhituDu (rElaMgi) kOyavAni vEShaMlO O cilakani paTTukuni pADukuMTU anvEShistuMTADu. mIrOni prEmiMcina sAmaMtarAju kUturu (aMjalIdEvi) A pATalOni praSnalaku narmagarBaMgA samAdhAnamiccE sannivESAniki anuguNaMgA UpiripOsukunna pATa idi.
iMdulO saMgIta sAhityAlu eMtaTi aunatyAnni saMtariMcukunnAyO mATallO ceppalEM. racanalO, svararacanalO, gAyanI gAyakulu pADE paddhatilO AyA raMgAlaku ceMdina kaLAkArulu pAtralaparaMgA eMta nijAyitIgA A rOjullO parakAya pravESaM cEsEvArO ceppaDAniki I pATE O cakkani udAharaNa.
'చిలకన్న చిలకవే' గురించి చెప్పాలంటే చాలా ఉంది. కథాపరంగా - విలన్ కుయుక్తి వలన సామంతరాజు దగ్గర బందీగా పడున్న హీరో జాడ తెలుసుకోవటానికి అతని స్నేహితుడు (రేలంగి) కోయవాని వేషంలో ఓ చిలకని పట్టుకుని పాడుకుంటూ అన్వేషిస్తుంటాడు. మీరోని ప్రేమించిన సామంతరాజు కూతురు (అంజలీదేవి) ఆ పాటలోని ప్రశ్నలకు నర్మగర్భంగా సమాధానమిచ్చే సన్నివేశానికి అనుగుణంగా ఊపిరిపోసుకున్న పాట ఇది.
ఇందులో సంగీత సాహిత్యాలు ఎంతటి ఔనత్యాన్ని సంతరించుకున్నాయో మాటల్లో చెప్పలేం. రచనలో, స్వరరచనలో, గాయనీ గాయకులు పాడే పద్ధతిలో ఆయా రంగాలకు చెందిన కళాకారులు పాత్రలపరంగా ఎంత నిజాయితీగా ఆ రోజుల్లో పరకాయ ప్రవేశం చేసేవారో చెప్పడానికి ఈ పాటే ఓ చక్కని ఉదాహరణ.