Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : N/A / వర్తించదు ,
Lyrics Writer : Muddukrishna / ముద్దుకృష్ణ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATanu maroka adButa svararacanagA pErkonAli. I pATanu kUDA GaMTasAla, jayalakShmi pADagA enTI^^Ar, sAvitripai citrIkariMcAru. idi oka rAgamAlikA gItaM. sAdhAraNaMgA rAgamAlika anagAnE oka rAgaM nuMci iMkO rAgaMki svararacana mArinappuDu SrOtalu okavidhamaina bEsgA uMTE 'punnami vannelalO' caraNAniki rAgESrI rAgAnni, 'kOyila pATala tIrulatO' caraNAniki tilaMg rAgAnni 'rAgamAlikala vINa nIve' caraNAniki kAPI rAgAnni vADukunnAru.
I rAgAlanu vADukOvaDaMlO upayOgiMcina rUpaka tALa prakAraMgA cUsukuMTE karNATaka SAstrIya saMpradAyAniki kAvalasina rItilOni Aru mAtrala naDakalO uMDE reMDu mAtrala coppuna mUDu KaMDAlugA kAkuMDA hiMdusthAnI paddhatilO upayOgiMcE mUDu mAtrala coppuna reMDu KaMDAlugA naDipiMcaTaM O pratyEkata prayOgaMgA pErkonAli. ika pADina GaMTasAla, jayalakShmi - biMduvulO siMdhuvulA tama pratiBanaMtA eMtO kluplaMgA, vinEvALLa guMDellO nikliptaMgA uMDETlu pradarSiMcAru.
ఈ పాటను మరొక అద్భుత స్వరరచనగా పేర్కొనాలి. ఈ పాటను కూడా ఘంటసాల, జయలక్ష్మి పాడగా ఎన్టీఆర్, సావిత్రిపై చిత్రీకరించారు. ఇది ఒక రాగమాలికా గీతం. సాధారణంగా రాగమాలిక అనగానే ఒక రాగం నుంచి ఇంకో రాగంకి స్వరరచన మారినప్పుడు శ్రోతలు ఒకవిధమైన బేస్‌గా ఉంటే 'పున్నమి వన్నెలలో' చరణానికి రాగేశ్రీ రాగాన్ని, 'కోయిల పాటల తీరులతో' చరణానికి తిలంగ్ రాగాన్ని 'రాగమాలికల వీణ నీవె' చరణానికి కాఫీ రాగాన్ని వాడుకున్నారు.
ఈ రాగాలను వాడుకోవడంలో ఉపయోగించిన రూపక తాళ ప్రకారంగా చూసుకుంటే కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయానికి కావలసిన రీతిలోని ఆరు మాత్రల నడకలో ఉండే రెండు మాత్రల చొప్పున మూడు ఖండాలుగా కాకుండా హిందుస్థానీ పద్ధతిలో ఉపయోగించే మూడు మాత్రల చొప్పున రెండు ఖండాలుగా నడిపించటం ఓ ప్రత్యేకత ప్రయోగంగా పేర్కొనాలి. ఇక పాడిన ఘంటసాల, జయలక్ష్మి - బిందువులో సింధువులా తమ ప్రతిభనంతా ఎంతో క్లుప్లంగా, వినేవాళ్ళ గుండెల్లో నిక్లిప్తంగా ఉండేట్లు ప్రదర్శించారు.