This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Santhanam
Song » Nidurapora.... / నిదురపో....
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 AnATi nuMci InATi varakU - telugu sinI saMgIta caritralO I pATanu miMcina jOla pATa marokaTi lEdanipiMcE vidhaMgA nilicipOyina 'nidurapOrA tammuDA' guriMci eMta ceppinA marikoMta migilipOyiMdEmOnanipistuMdi. pADukunE alavATunna prativArini tAdAtmyaMlOki tIsukupOyi guMDeni cemariMpacEyagala gItamidi. pallaviki, toli caraNAniki hiMdUsthAnI rAgamaina bEhAgni AdhAraMgA cEsukuMTU 'jAlitalaci kannIru tuDicE' caraNAniki hiMdUsthAnI Bairavini vADukunnAru susarla. hAyigA jOlalA sAgE I rasa spaMdananu karuNa, ArthratatO niMputU SOkAnikI tArAsthAyigA migilElA tIsukupOvAlaMTE A Sakti hiMdUsthAnI BairavikE uMdani grahiMcina susarla rasasiddhiki nidarSanaM I pATa.

citraM toliBAgaMlO vaccE I pATa tirigi patAka sannivESaMlO kUDA vastuMdi. iMdulO GaMTasAla kaMThaM kUDA vinipistuMdi. GaMTasAla - latA pADina I reMDO pATa appaTlO rikArDugA vaccina dAKalA lEdu. ippuDu konni kyAseTlalO dorukutunnaTlu vinikiDi. I 'nidurapOrA tammuDA' pATani BAvasPOrakaMgA latA pADina paddhatiki Ameku telugu rAdaMTE ippaTikI namminavALLu unnAru. aMta goppagA uMdi Ame telugu ucCAraNa. reMDu caraNaM 'jAli talaci'lO gAtra dharmAniki Ayuvu paTTugA nilicE 'dAtalE kanarArE' daggira aTu latA, iTu GaMTasAla iddarU iddarE annaTlu SiKarAyamAna sthAnaMlO nilicAru.

Important information - Telugu

ఆనాటి నుంచి ఈనాటి వరకూ - తెలుగు సినీ సంగీత చరిత్రలో ఈ పాటను మించిన జోల పాట మరొకటి లేదనిపించే విధంగా నిలిచిపోయిన 'నిదురపోరా తమ్ముడా' గురించి ఎంత చెప్పినా మరికొంత మిగిలిపోయిందేమోననిపిస్తుంది. పాడుకునే అలవాటున్న ప్రతివారిని తాదాత్మ్యంలోకి తీసుకుపోయి గుండెని చెమరింపచేయగల గీతమిది. పల్లవికి, తొలి చరణానికి హిందూస్థానీ రాగమైన బేహాగ్ని ఆధారంగా చేసుకుంటూ 'జాలితలచి కన్నీరు తుడిచే' చరణానికి హిందూస్థానీ భైరవిని వాడుకున్నారు సుసర్ల. హాయిగా జోలలా సాగే ఈ రస స్పందనను కరుణ, ఆర్థ్రతతో నింపుతూ శోకానికీ తారాస్థాయిగా మిగిలేలా తీసుకుపోవాలంటే ఆ శక్తి హిందూస్థానీ భైరవికే ఉందని గ్రహించిన సుసర్ల రససిద్ధికి నిదర్శనం ఈ పాట.


చిత్రం తొలిభాగంలో వచ్చే ఈ పాట తిరిగి పతాక సన్నివేశంలో కూడా వస్తుంది. ఇందులో ఘంటసాల కంఠం కూడా వినిపిస్తుంది. ఘంటసాల - లతా పాడిన ఈ రెండో పాట అప్పట్లో రికార్డుగా వచ్చిన దాఖలా లేదు. ఇప్పుడు కొన్ని క్యాసెట్లలో దొరుకుతున్నట్లు వినికిడి. ఈ 'నిదురపోరా తమ్ముడా' పాటని భావస్ఫోరకంగా లతా పాడిన పద్ధతికి ఆమెకు తెలుగు రాదంటే ఇప్పటికీ నమ్మినవాళ్ళు ఉన్నారు. అంత గొప్పగా ఉంది ఆమె తెలుగు ఉచ్ఛారణ. రెండు చరణం 'జాలి తలచి'లో గాత్ర ధర్మానికి ఆయువు పట్టుగా నిలిచే 'దాతలే కనరారే' దగ్గిర అటు లతా, ఇటు ఘంటసాల ఇద్దరూ ఇద్దరే అన్నట్లు శిఖరాయమాన స్థానంలో నిలిచారు.