This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Non-Film-
Song » Challagalilo - Nati geethala parijathala / చల్ల గాలిలో - నాటి గీతాల పారిజాతాల
Click To Rate
* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 
I paaTalO ' vinipiMcani raagaalE' , 'madilO vINalu mrOgE'  paaTalni iMTalUDs gaa upayOgiMcukunnaaru.  yas. raajESvararaavu gaari saMgItaM pai vETUri gaariki eMtaTi
anuraagaM, abhimaanaM, gauravaM vunnaayO aNuvaNuvunaa telisipOyE paaTa idi. modaTi caraNaM lO 'mallISvariki, mEGamaalaku nuvu nErpina bhImaplaasulu (mallISvari sinimaalO 'aakaaSavIdhilO ... raagaala O mEGamaalaa' paaTa bhIMplaas raagaMtOnE modalavutuMdi) anE vaakyaM aa anuraagaaniki udaaharaNa gaa nilistE - 'missamma' sinimaalOni 'bRMdaavanamadi aMdaridi gOviMduDu aMdari vaaDElE ' paaTanu dRSHTilO peTTukuni ' nI bRMdaavanamadi maa aMdaridI maa raajESvaruDaMdari vaaDElE'  aa abhimaanaaniki saakSHyaMgaa nilicipOtuMdi. alaagE  'vennela paaLitO veMDitera pai nuvu raasina caMdralEKalu (caMdralEKa sinimaa ki raajESvararaavu gaaru iccina Drams Dyaans myUjik aa rOjullO pedda saMcalanaM),  'ekkaDa ekkaDa aa mOhanaala molakalu' (raajESvararaavu gaari saMgItaMlO mOhana raagaM ki unna sthaanaM apaaraM),  'eppuDu maasTaaru maLLI aa svara yugaM - uMdO lEdO I janma kaa yOgaM'  vaMTi vaakyaalu  aayana paTla vETUri gaariki unna gauravaaniki akSHaraabhiSHEkaM laa anipistaayi. muKyaMgaa I  vaakyaalu viMTuMTE raajESvararaavu gaari abhimaanulaku guMDe cemmagillaka maanadu. aMdukEnEmO I aaDiyO aaviSHkaraNa sabhalO spIkar lO I paaTa vastunnaMta sEpU SrImati pi. suSIla kaLLu vottukuMTUnE vunnaaru.  ika I paaTaku siMgItaM gaaru samakUrcina TyUnu, daanni SrI baalu gaaru tanadaina spaSHTamaina vaacakaMtO , gaLamaadhuryaM tO, bhaavasphOrakaMgaa aaviSHkariMcina tIru,   madhya madhya raajESvararaavu gaaru saMgItaannicci paaDina   alanaaTi "callagaalilO yamunaa taTi pai' lalita gItanni imiDcina paddhati - ivannI I paaTani padE padE vinElaa cEstaayi.    
 
yas. raajESvararaavu gaari ki nivaaLigaa ilaa O prayOgaMlaa ceyyoccanna aalOcana siMgItaM SrInivaasa raavu gaariki eppaTniMci vuMdi , aa aalOcana O aalbam gaa kaaryarUpaM daalcaDaaniki aayana EM cESaaru, aMduku evarevaru elaa elaa tODpaDDaaru, eMta maMdi labdhapratiSHTulu I albam lO paaTalu raaSaaru, eMtamaMdi suprasiddhulu vaaTini aalapiMcaaru - vITanninI savivaraMgaa pErkoMTU raasina viSlESHaaNaatmaka vyaasaM cadavaalanukuMTE I liMk ni klik ceyyaMDi.
 
Important information - Telugu

 

ఈ పాటలో ' వినిపించని రాగాలే' , 'మదిలో వీణలు మ్రోగే'  పాటల్ని ఇంటలూడ్స్ గా ఉపయోగించుకున్నారు.  యస్. రాజేశ్వరరావు గారి సంగీతం పై వేటూరి గారికి ఎంతటి అనురాగం, అభిమానం, గౌరవం వున్నాయో అణువణువునా తెలిసిపోయే పాట ఇది. మొదటి చరణం లో 'మల్లీశ్వరికి, మేఘమాలకు నువు నేర్పిన భీమప్లాసులు ' (మల్లీశ్వరి సినిమాలో 'ఆకాశవీధిలో ... రాగాల ఓ మేఘమాలా' పాట భీంప్లాస్ రాగంతోనే మొదలవుతుంది) అనే వాక్యం ఆ అనురాగానికి ఉదాహరణ గా నిలిస్తే - 'మిస్సమ్మ' సినిమాలోని 'బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ' పాటను దృష్టిలో పెట్టుకుని ' నీ బృందావనమది మా అందరిదీ మా రాజేశ్వరుడందరి వాడేలే'  ఆ అభిమానానికి సాక్ష్యంగా నిలిచిపోతుంది. అలాగే  'వెన్నెల పాళితో వెండితెర పై నువు రాసిన చంద్రలేఖలు' (చంద్రలేఖ సినిమా కి రాజేశ్వరరావు గారు ఇచ్చిన డ్రమ్స్ డ్యాన్స్ మ్యూజిక్ ఆ రోజుల్లో పెద్ద సంచలనం),  'ఎక్కడ ఎక్కడ ఆ మోహనాల మొలకలు' (రాజేశ్వరరావు గారి సంగీతంలో మోహన రాగం కి ఉన్న స్థానం అపారం),  'ఎప్పుడు మాస్టారు మళ్ళీ ఆ స్వర యుగం - ఉందో లేదో ఈ జన్మ కా యోగం'  వంటి వాక్యాలు  ఆయన పట్ల వేటూరి గారికి ఉన్న గౌరవానికి అక్షరాభిషేకంలా అనిపిస్తాయి. ముఖ్యంగా ఈ  వాక్యాలు వింటుంటే రాజేశ్వరరావు గారి అభిమానులకు గుండె చెమ్మగిల్లక మానదు. అందుకేనేమో ఈ ఆడియో ఆవిష్కరణ సభలో స్పీకర్ లో ఈ పాట వస్తున్నంత సేపూ శ్రీమతి పి. సుశీల కళ్ళు వొత్తుకుంటూనే వున్నారు.  ఇక ఈ పాటకు సింగీతం గారు సమకూర్చిన ట్యూను, దాన్ని శ్రీ బాలు గారు తనదైన స్పష్టమైన వాచకంతో , గళమాధుర్యం తో, భావస్ఫోరకంగా ఆవిష్కరించిన తీరు,   మధ్య మధ్య రాజేశ్వరరావు గారు సంగీతాన్నిచ్చి పాడిన   అలనాటి "చల్లగాలిలో యమునా తటి పై' లలిత గీతన్ని ఇమిడ్చిన పద్ధతి - ఇవన్నీ ఈ పాటని పదే పదే వినేలా చేస్తాయి.    
 
యస్. రాజేశ్వరరావు గారి కి నివాళిగా ఇలా ఓ ప్రయోగంలా చెయ్యొచ్చన్న ఆలోచన సింగీతం శ్రీనివాస రావు గారికి ఎప్పట్నించి వుంది , ఆ ఆలోచన ఓ ఆల్బమ్ గా కార్యరూపం దాల్చడానికి ఆయన ఏం చేశారు, అందుకు ఎవరెవరు ఎలా ఎలా తోడ్పడ్డారు, ఎంత మంది లబ్ధప్రతిష్టులు ఈ అల్బమ్ లో పాటలు రాశారు, ఎంతమంది సుప్రసిద్ధులు వాటిని ఆలపించారు - వీటన్నినీ సవివరంగా పేర్కొంటూ రాసిన విశ్లేషాణాత్మక వ్యాసం చదవాలనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి.