Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,
Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,
Lyrics Writer : Veeturi / వీటూరి ,
Singer : Balamurali Krishna / బాలమురళి కృష్ణ ,
Song Category : Others
Song- Ragam :
vETUri I pATanu rAsi en.Ti.Ar. ku cUpiMcagAnE pakkanE vunna koMDavITi veMkaTakavi 'adEmiTi nAyanA ... haMsa gamanA annAvu. AdilOnE haMsapAdu anE mATanu vinalEdA ? aTuvaMTi aSuBAnni elA ApAdistAvu?' aMTU aByaMtaraM ceppAru. appuDu vETUri 'ikkaDa haMsa aMTE nITilO vihariMcE haMsa kAdaMDI... sUryuDuki haMsa anE iMkO pEruMdi. caMdassulO ATaveladi lakShaNAla lOni sUrya gaNAla guriMci cebutU haMsa paMcakammu ATaveladi ani annAru kadA A haMsa aMDi. E vELalOnainA gati tappani gamanaM sUryunidi. aTuvaMTi gati tappani gamanaMtO nATyamADamani bRuhannala uttarani ASIrvadistE bAvuMTuMdani alA rASAnaMDI' ani annAru. dAMtO aTu koMDavITi veMkaTa kavi, iTu en.Ti.Ar. iddarU murisipOtU vETUrini kaugaliMcukunnAru.
వేటూరి ఈ పాటను రాసి ఎన్.టి.ఆర్. కు చూపించగానే పక్కనే వున్న కొండవీటి వెంకటకవి 'అదేమిటి నాయనా ... హంస గమనా అన్నావు. ఆదిలోనే హంసపాదు అనే మాటను వినలేదా ? అటువంటి అశుభాన్ని ఎలా ఆపాదిస్తావు?' అంటూ అభ్యంతరం చెప్పారు. అప్పుడు వేటూరి 'ఇక్కడ హంస అంటే నీటిలో విహరించే హంస కాదండీ... సూర్యుడుకి హంస అనే ఇంకో పేరుంది. చందస్సులో ఆటవెలది లక్షణాల లోని సూర్య గణాల గురించి చెబుతూ హంస పంచకమ్ము ఆటవెలది అని అన్నారు కదా ఆ హంస అండి. ఏ వేళలోనైనా గతి తప్పని గమనం సూర్యునిది. అటువంటి గతి తప్పని గమనంతో నాట్యమాడమని బృహన్నల ఉత్తరని ఆశీర్వదిస్తే బావుంటుందని అలా రాశానండీ' అని అన్నారు. దాంతో అటు కొండవీటి వెంకట కవి, ఇటు ఎన్.టి.ఆర్. ఇద్దరూ మురిసిపోతూ వేటూరిని కౌగలించుకున్నారు.