Actor :
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu suSIla bRuMdaM pADAru. aMjalIdEvi takkina naTTuvarALLatO aBinayiMcAru. iMTar lUDslO akkinEni vENuvu vAyistU kanipistAru. hiMdOLarAgaMlO svaraparacabaDina I pATa kUDA mUDu BAShalalOnU sarisamAnaMgA hiT ayiMdi. tamiLaMlO 'aShTaijAdE', telugula 'piluvakurA', hiMdIlO 'muJE nA bulA' pATalalO Edi goppadi aMTE O paTTAna tElci ceppaTaM kaShTaM.
kAkapOtE hiMdI koccEsariki pADukOvaTAniki kAsta suluvugA malicAru. telugu pATalO pallavi civarna 'palucana salupakurA' anE padaM tarvAta koMta insTrumeMTal myUjik vastuMdi. A myUjik lEkaMDA AlapistE - vinnavAriki pADukunna vAriki kAsta asaMpUrNaMgA uMTuMdi. kAnI hiMdIlO A velitini cAlA telivigA pUriMci, vijaya SaMKaM pUriMcAru AdinArAyaNarAvu. adi EmiTO elAgO reMDu pATalanu daggara peTTukuni vinnavAriki mAtramE telustuMdi.
ఈ పాటను సుశీల బృందం పాడారు. అంజలీదేవి తక్కిన నట్టువరాళ్ళతో అభినయించారు. ఇంటర్ లూడ్స్లో అక్కినేని వేణువు వాయిస్తూ కనిపిస్తారు. హిందోళరాగంలో స్వరపరచబడిన ఈ పాట కూడా మూడు భాషలలోనూ సరిసమానంగా హిట్ అయింది. తమిళంలో 'అష్టైజాదే', తెలుగుల 'పిలువకురా', హిందీలో 'ముఝే నా బులా' పాటలలో ఏది గొప్పది అంటే ఓ పట్టాన తేల్చి చెప్పటం కష్టం.
కాకపోతే హిందీ కొచ్చేసరికి పాడుకోవటానికి కాస్త సులువుగా మలిచారు. తెలుగు పాటలో పల్లవి చివర్న 'పలుచన సలుపకురా' అనే పదం తర్వాత కొంత ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ లేకండా ఆలపిస్తే - విన్నవారికి పాడుకున్న వారికి కాస్త అసంపూర్ణంగా ఉంటుంది. కానీ హిందీలో ఆ వెలితిని చాలా తెలివిగా పూరించి, విజయ శంఖం పూరించారు ఆదినారాయణరావు. అది ఏమిటో ఎలాగో రెండు పాటలను దగ్గర పెట్టుకుని విన్నవారికి మాత్రమే తెలుస్తుంది.