ఈ పాటను ఘంటసాల పాడగా అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారిగా అభినయించారు. చరణాల మధ్య ఇంటర్లూడ్స్ వింటుంటే ఒక వెస్ట్రన్ ఆర్కెస్ట్రా పీస్ వింటున్నట్టు ఉంటుంది. ఈ నాటికీ నవీనంగా ఉండటమే ఈ పాట ప్రత్యేకత. స్వరపరంగా చూసుకుంటే ఇది కార్డ్ కంపోజిషన్. ఘంటసాల గళానికున్న రేంజ్ ని, సొగసుగా, లబ్జుగా వినిపించే నాసికా ధ్వనిని అతి అందంగా వాడుకున్న పాట ఇది. 'ఆటా పాటలందు కవ్వించు కొంటె కోణంగి/నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో ' అనే వాక్యాలు ఏ రేంజ్ కయినా అరేంజ్ అవుతూ మాధుర్యాన్ని కోల్పోని ఆయన స్వరపటిమను తెలియజేస్తే - 'నా దరికిదూకునో / తానలిగిపోవునో ' వాక్యాలలోని 'నో' అనే అక్షరాలు అయన్లో ప్రత్యేకంగా గల 'నాసికాధ్వని సౌందర్యానికి ' అద్దం పడతాయి.
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ