Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల , Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
ఈ పాటను ఘంటసాల, జిక్కీ పాడగా మొట్టమొదట 'ఒ హొ హొ ఒహొ ' అంటూ వచ్చే ఆలాపన కె.రాణిది. యమన్ రాగచ్చాయలతో సాగిన ఈ పాట చరణాల ముందు వచ్చే ఇంటర్లూడ్ లలో వినిపించే హవాయిన్ గిటార్ నేరుగా మనసునే మీటినంత హాయిగా ఉంటుంది. ఈ పాట సాహిత్యాన్ని ఆసాంతం రెండు మూడుసార్లు గమనిస్తే - దేవదాసు, పార్వతి పాత్రల మనస్తత్వాన్ని, ఒకరిపై ఒకరికి గల అభిప్రాయాన్ని - వీలయినంత క్లుప్తంగా సగటు ప్రేక్షకునికి కూడా అర్ధమయ్యే సామాన్య భాషలో చెబుతూనే - వారి పాత్రలు విడిపోతాయి అనే విషయాన్ని- అన్యాపదేశంగా హెచ్చరిస్తున్నట్లు వుంటుంది.