Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Meloncholic Songs
Song- Ragam :
ఈ పాటను ఘంటసాల, కె.రాణి పాడగా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించారు. 'దేవదాసు ' చిత్రంతోనే సంగీత ప్రియులంతా ఈ నాటికీ గుర్తుపెట్టుకునే కె.రాణి పాడిన తెలుగు పాటలు తక్కువే. ప్రస్తుతం ఆమె బెంగుళూరులో కొన్నాళ్ళు , హైదరాబాద్ లో కొన్నాళ్ళు ఉంటున్నారు. ఈ పాటలో తొలిస్దానం సాహిత్యందే. 'మరపురాని బాధకన్నా మధురమే లేదు / గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు / అందరాని పొందుకన్నా అందమే లేదు / అనందమే లేదు ' వంటి వాక్యాలు లేదు అప్పుడే కాదు ఇప్పుడు విన్నా, మరో యాభై సంవంత్సరాల తర్వాత విన్నా మనసున్న ప్రతి కంటికీ చెమరింపు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. కాలదోషం పట్టని భాషా సౌందర్యాన్ని అందించే సౌలభ్యం, అదృష్టం ఆనాటి రచయితలకుండేది. ఇక సంగీతపరంగా చెప్పుకోవాలంటే...ఈ పాట మొదలవుతున్నప్పుడు వచ్చే వాద్య సంగీతంవింటే ఆ రోజుల్లో వచ్చే క్లబ్ డాన్సులకు ఉపయోగించే ఆర్కెష్ట్రయిజేషను మెల్లగా విషానుభూతిలోకి తీసుకు వెళ్ళిపోతుంది. ఆర్కెష్ట్రా వారికి, అందుకు తగినట్టుగా నొటేషన్ ని(స్వరాలని) చెప్పి, ప్రాక్టీస్ చేయించటం అంత సులువైన విషయమేమీ కాదు. ఈ మాట ఇక్కడ ఎందుకు ఉదహరించాలంటే సంగీత దర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్ కి స్వరం రాసుకునే అలవాటు లేదు. ట్యూన్ గనక ఒకసారి మనసులోంచి బైటకు వచ్చి అందరి అమోదాన్నీ పొందిందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత రికార్డింగ్ పెట్టుకున్నా సరే ఆనాడు అనుకున్న స్వరం అలాగే అచ్చుగుద్దినట్టు యధాతధంగా వచ్చేది. "విపరీతమైన జ్ఞాపకశక్తి గల మహామేధావి ఆయన" అని అంటారు ఆ రోజుల్లో ఆయనకు సహాయకునిగా పనిచేసిన సంగీత దర్శకుడు శ్రీ ఎమ్మెస్ విశ్వనాధం ఆనాటి సంగతులు గుర్తు చేస్తే.