Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Ghantasala / ఘంటసాల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla pADagA en.Ti.Ar aBinayiMcAru. I pATalO pallavi mugiyagAnE modalayyE iMTarlUDni aMdukunE paddatini guriMci muKyaMgA ceppukOvAli. pallavi civarna gala lyAMDiMg nOT - iMTar lUD modalayyE TEkAP nOT - I reMDiTikI samanvayaM kudiritE adi eMta cakkagA uMTuMdO - asalu iMpugA amaraTaM aMTE arthaM EmiTO telustuMdi. I pATaki saMbaMdiMcina maroka viShayaM EmITaMTE idi harikAMBOji svarAla mIda svaraparacabaDiMdi. harikAMBOji svarAla mIda GaMTasAla kUrcina maroka pATa ''maruvalEnurA - O...paMcadAra vaMTi pOlIseMkaTasAmi ninnu nEnu maruvalEnurA''! I pATa maracipOyE teluguvADuMDaDu. I pATa iMTarlUDlu, 'migiliMdinEnA' pATa iMTarlUDlu okadAni taruvAta iMkokaTi vini cUDaMDi.
eMta pOlika kanabaDutuMdO mIku telustuMdi. ''are! adi huShAru gItaM, idi viShAda gItaM... adelA!?'' ani anipiMcaTaM sahajaM....mUlaM okE rAgAniki saMbaMdhiMcina svarAlu ani telistE A anuBUti cAlA bAvuMTuMdi. prayatniMci cUDaMDi. idilA uMDagA 'BariMcunadi' anE arthaMlO mallAdi vAru I pATalO 'Baramai' anE padAnni vADAru. tarvAta tarvAta I padAnni iMkE sinIgItaM lOnU vADinaTTu lEdu.
ఈ పాటను ఘంటసాల పాడగా ఎన్.టి.ఆర్ అభినయించారు. ఈ పాటలో పల్లవి ముగియగానే మొదలయ్యే ఇంటర్లూడ్ని అందుకునే పద్దతిని గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. పల్లవి చివర్న గల ల్యాండింగ్ నోట్ - ఇంటర్ లూడ్ మొదలయ్యే టేకాఫ్ నోట్ - ఈ రెండిటికీ సమన్వయం కుదిరితే అది ఎంత చక్కగా ఉంటుందో - అసలు ఇంపుగా అమరటం అంటే అర్థం ఏమిటో తెలుస్తుంది. ఈ పాటకి సంబందించిన మరొక విషయం ఏమీటంటే ఇది హరికాంభోజి స్వరాల మీద స్వరపరచబడింది. హరికాంభోజి స్వరాల మీద ఘంటసాల కూర్చిన మరొక పాట ''మరువలేనురా - ఓ...పంచదార వంటి పోలీసెంకటసామి నిన్ను నేను మరువలేనురా''! ఈ పాట మరచిపోయే తెలుగువాడుండడు. ఈ పాట ఇంటర్లూడ్లు, 'మిగిలిందినేనా' పాట ఇంటర్లూడ్లు ఒకదాని తరువాత ఇంకొకటి విని చూడండి.
ఎంత పోలిక కనబడుతుందో మీకు తెలుస్తుంది. ''అరె! అది హుషారు గీతం, ఇది విషాద గీతం... అదెలా!?'' అని అనిపించటం సహజం....మూలం ఒకే రాగానికి సంబంధించిన స్వరాలు అని తెలిస్తే ఆ అనుభూతి చాలా బావుంటుంది. ప్రయత్నించి చూడండి. ఇదిలా ఉండగా 'భరించునది' అనే అర్థంలో మల్లాది వారు ఈ పాటలో 'భరమై' అనే పదాన్ని వాడారు. తర్వాత తర్వాత ఈ పదాన్ని ఇంకే సినీగీతం లోనూ వాడినట్టు లేదు.