Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Malladi Ramakrishna Sastri / మల్లాది రామకృష్ణశాస్త్రి ,
Singer : Ghantasala / ఘంటసాల , P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla, lIla bRuMdaM pADagA en.Ti.Ar, jamuna marikoMtamaMdi upapAtradhArulu aBinayiMcAru. mOhanarAgacCAyala paina AdhArapaDina I gItAnni ippuDu vinaTaM taTasthistE SrOtala manasulalO rakarakAla BAvAlu celarEgutAyi. aMduku muKyakAraNaM 'mAyAbajAr' sinimAlOni saMgItAniki saMbaMdhiMcina viSEShamE! 'mAyAbajAr' sinimAku saMgIta darSakunigA GaMTasAla pEru vunnA, aMdulOni muKyamaina nAlugu yugaLa gItAlU yas. rAjESvararAvu svaraparicAranna viShayaM telugu sinI saMgItAnni jAgrattagA gamanistU unna vAraMdariki telusu. ayitE aMdulO cAlAmaMdi A nAlugu pATalnI rAjESvararAvu gAru TyUn cEyaTamE kAkuMDA rikArDiMg kUDA cEsEsArani anukuMTU uMTAru. kAnI A pATalu TyUnlu 'OkE' ayipOyAka konni kAraNAMtarAla valana rAjESvararAvugAru A sinimA nuMDi tappukOgA GaMTasAlagAru migilina pATalanu TyUn cEyaTamE kAkuMDA I nAlugu pATalaku iMTar lUDlu samakUrci rikArDiMg bAdhyatalu avI neravErcAru. A viShayAnni I 'allavADE rEpallevADE' pATa dhruvIkaristuMdi. kAvAlaMTE 'mAyAbajAr' lOni 'lAhiri lAhiri lAhiri'lO pATanu I 'allavADE rEpallevADE' pATanu pakka pakkana peTTukuni, okadAni tarvAta iMkokaTi vini cUDaMDi. reMDiMTi rUpakalpanalOnU eMta pOlika uMdO telustuMdi.
ఈ పాటను ఘంటసాల, లీల బృందం పాడగా ఎన్.టి.ఆర్, జమున మరికొంతమంది ఉపపాత్రధారులు అభినయించారు. మోహనరాగచ్ఛాయల పైన ఆధారపడిన ఈ గీతాన్ని ఇప్పుడు వినటం తటస్థిస్తే శ్రోతల మనసులలో రకరకాల భావాలు చెలరేగుతాయి. అందుకు ముఖ్యకారణం 'మాయాబజార్' సినిమాలోని సంగీతానికి సంబంధించిన విశేషమే! 'మాయాబజార్' సినిమాకు సంగీత దర్శకునిగా ఘంటసాల పేరు వున్నా, అందులోని ముఖ్యమైన నాలుగు యుగళ గీతాలూ యస్. రాజేశ్వరరావు స్వరపరిచారన్న విషయం తెలుగు సినీ సంగీతాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్న వారందరికి తెలుసు.
అయితే అందులో చాలామంది ఆ నాలుగు పాటల్నీ రాజేశ్వరరావు గారు ట్యూన్ చేయటమే కాకుండా రికార్డింగ్ కూడా చేసేసారని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పాటలు ట్యూన్లు 'ఓకే' అయిపోయాక కొన్ని కారణాంతరాల వలన రాజేశ్వరరావుగారు ఆ సినిమా నుండి తప్పుకోగా ఘంటసాలగారు మిగిలిన పాటలను ట్యూన్ చేయటమే కాకుండా ఈ నాలుగు పాటలకు ఇంటర్ లూడ్లు సమకూర్చి రికార్డింగ్ బాధ్యతలు అవీ నెరవేర్చారు. ఆ విషయాన్ని ఈ 'అల్లవాడే రేపల్లెవాడే' పాట ధ్రువీకరిస్తుంది. కావాలంటే 'మాయాబజార్' లోని 'లాహిరి లాహిరి లాహిరి'లో పాటను ఈ 'అల్లవాడే రేపల్లెవాడే' పాటను పక్క పక్కన పెట్టుకుని, ఒకదాని తర్వాత ఇంకొకటి విని చూడండి. రెండింటి రూపకల్పనలోనూ ఎంత పోలిక ఉందో తెలుస్తుంది.