This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Bhale-Ammayilu
Song » Oho Bangaru / ఓహో బంగరు
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
0 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

'OhO baMgaru ciluka' pATanu jikki gAnaM cEyagA sAvitri, yan.Ti.Ar.pai citrIkariMcAru. I pATa pIlU, aBEri rAgAlapai AdhArapaDiMdi. I pATalO rAjESvararAvu mudra cAlAcOTla kanabaDutU uMTuMdi. 'kanikAraM lEdA kanneduTa nilacinA' anE reMDava caraNAniki muMdu vaccE AlApananu AlapiMcukuMTU pOtE 'BalErAmu' sinimAlOni 'OhO mEGamAlA... callagA rAvElA' anE pATalO tElatAM... alAgE reMDu caraNAlalOnU 'cirunavvu navvitE ratanAlu rAlunA' anE vAkyaM tarvAta vaccE PlUT biT nu AlApiMcukuMTU pOtE 'ceMculakShmi' sinimAlO 'kAnagarAvA O SrIhari rAvA' pATalOni modaTi caraNaMlOni 'vEci vEci kanulEmO kAyalu kAcE' tarvAta vaccE PlUT biT daggara tEltAM.

I reMDu udAharaNalu eMduku ceppAlsi vacciMdaMTE - okkokka saMgIta darSakuDiki tanadaina Saili uMTuMdi. A mudra dvArA Ayananu gurtiMcavaccu. saMgItaM aByasiMcakuMDA sinI saMgItaM dvArA rAgAlatO paricayaM ErparcukOvAlanE vAri^^i I rakamaina sAdhana upakaristuMdi. I pATalOni 'ceruvu mIda alakaitE' anE prayOgaM saBya prapaMcaMlOni viluvala dRuShTyA appaTlO cAlAmaMdiki kAsta ibbaMdigAnE anipiMciMdi.

Important information - Telugu

'ఓహో బంగరు చిలుక' పాటను జిక్కి గానం చేయగా సావిత్రి, యన్.టి.ఆర్.పై చిత్రీకరించారు. ఈ పాట పీలూ, అభేరి రాగాలపై ఆధారపడింది. ఈ పాటలో రాజేశ్వరరావు ముద్ర చాలాచోట్ల కనబడుతూ ఉంటుంది. 'కనికారం లేదా కన్నెదుట నిలచినా' అనే రెండవ చరణానికి ముందు వచ్చే ఆలాపనను ఆలపించుకుంటూ పోతే 'భలేరాము' సినిమాలోని 'ఓహో మేఘమాలా... చల్లగా రావేలా' అనే పాటలో తేలతాం... అలాగే రెండు చరణాలలోనూ 'చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా' అనే వాక్యం తర్వాత వచ్చే ఫ్లూట్ బిట్ ను ఆలాపించుకుంటూ పోతే 'చెంచులక్ష్మి' సినిమాలో 'కానగరావా ఓ శ్రీహరి రావా' పాటలోని మొదటి చరణంలోని 'వేచి వేచి కనులేమో కాయలు కాచే' తర్వాత వచ్చే ఫ్లూట్ బిట్ దగ్గర తేల్తాం.

ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే - ఒక్కొక్క సంగీత దర్శకుడికి తనదైన శైలి ఉంటుంది. ఆ ముద్ర ద్వారా ఆయనను గుర్తించవచ్చు. సంగీతం అభ్యసించకుండా సినీ సంగీతం ద్వారా రాగాలతో పరిచయం ఏర్పర్చుకోవాలనే వారిఇ ఈ రకమైన సాధన ఉపకరిస్తుంది. ఈ పాటలోని 'చెరువు మీద అలకైతే' అనే ప్రయోగం సభ్య ప్రపంచంలోని విలువల దృష్ట్యా అప్పట్లో చాలామందికి కాస్త ఇబ్బందిగానే అనిపించింది.