Actor : Jaggayya / జగ్గయ్య ,
Actress : Girija / గిరిజ ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Sadasiva Brahmam / సదాశివ బ్రహ్మం ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu suSIla pADaga, girija, jaggayyapai citrIkariMcAru. vinnavArevarikainA sarE... pATalO OM pradhamaMgA AkaTTukunEdi suSIla goMtulOni PreSh nes.... svacCata! konni konni pATalanu viMTunna koddI parij~jAnaM perugutU uMTuMdi. ennO pATala CAyalu manasuni spRuSiMcipOtuMTAyi. I pATalO inni PrEjlu unnAyA... I PrEjtO tarvAta iMkO pATa tayArayiMdA... ani anipiMcE rAgAnuBAvaMtO hRudayaM susaMpannaM ayipOtU uMTuMdi. aTuvaMTi anuBUtini kaligiMcE pATa idi.
pallavi reMDulainlatO pATu toli caraNaMlOni 'prEma taraMgamA - nA aMtaraMgamU' anE lainuki, mali caraNaMlOni 'nI kanusannalU - nI cirunavvulU' anE lainuki jatapaDina TyUn AlapistU uMTE... 'suBAkA tArA (1954) sinimAlO 'gayA aMdhErA - huvA vuJAlA' pATa gurtostuMdi. I pATanu 'saMtAnaM (1955) sinimAlO 'saMtOShamElA saMgItamElA' pATaku vADukunnAru. alAgE toli caraNaMlOni reMDava lainu 'CeMgu ceMguna dUkE pasiDi turaMgamu', mali caraNaMlOni reMDava lainu 'aravirisina virajAji mallepuvvulU' viMTuMTE - hAsyanaTuDu BagavAn nirmiMcina 'alBElA' sinimA kOsaM si.rAmacaMdra svaraparici cital kar pErutO latAtO pADina 'ShOlAj baD kE - dil mErA dhaDak' anE mUDava lainu gurtostuMdi.
ఈ పాటను సుశీల పాడగ, గిరిజ, జగ్గయ్యపై చిత్రీకరించారు. విన్నవారెవరికైనా సరే... పాటలో ఓం ప్రధమంగా ఆకట్టుకునేది సుశీల గొంతులోని ఫ్రెష్ నెస్.... స్వచ్ఛత! కొన్ని కొన్ని పాటలను వింటున్న కొద్దీ పరిజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎన్నో పాటల ఛాయలు మనసుని స్పృశించిపోతుంటాయి. ఈ పాటలో ఇన్ని ఫ్రేజ్లు ఉన్నాయా... ఈ ఫ్రేజ్తో తర్వాత ఇంకో పాట తయారయిందా... అని అనిపించే రాగానుభావంతో హృదయం సుసంపన్నం అయిపోతూ ఉంటుంది. అటువంటి అనుభూతిని కలిగించే పాట ఇది.
పల్లవి రెండులైన్లతో పాటు తొలి చరణంలోని 'ప్రేమ తరంగమా - నా అంతరంగమూ' అనే లైనుకి, మలి చరణంలోని 'నీ కనుసన్నలూ - నీ చిరునవ్వులూ' అనే లైనుకి జతపడిన ట్యూన్ ఆలపిస్తూ ఉంటే... 'సుభాకా తారా (1954) సినిమాలో 'గయా అంధేరా - హువా వుఝాలా' పాట గుర్తొస్తుంది. ఈ పాటను 'సంతానం (1955) సినిమాలో 'సంతోషమేలా సంగీతమేలా' పాటకు వాడుకున్నారు. అలాగే తొలి చరణంలోని రెండవ లైను 'ఛెంగు చెంగున దూకే పసిడి తురంగము', మలి చరణంలోని రెండవ లైను 'అరవిరిసిన విరజాజి మల్లెపువ్వులూ' వింటుంటే - హాస్యనటుడు భగవాన్ నిర్మించిన 'అల్భేలా' సినిమా కోసం సి.రామచంద్ర స్వరపరిచి చితల్ కర్ పేరుతో లతాతో పాడిన 'షోలాజ్ బడ్ కే - దిల్ మేరా ధడక్' అనే మూడవ లైను గుర్తొస్తుంది.
ఇక తొలి చరణంలోని మూడవ లైను - 'వినువీధులలో విహరించేటి' మలి చరణంలోని మూడవ లైను - 'నీ మురిపాలూ - నీ సరసాలూ'... ఈ రెండు లైన్ల ట్యూన్ ని వింటుంటే తర్వాతి రోజుల్లో రాజేశ్వరరావు 'అమాయకురాలు' సినిమా కోసం స్వరపరిచిన 'సన్నజాజి పువ్వులు - చందమామ కాంతులు - చిన్నారి పాప నవ్వులు' అనే పాటు గుర్తొస్తూ వుంటుంది.