Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా ,
Song Category : Others
Song- Ragam :
I pATanu E.eM.rAjA pADagA akkinEni aBinayiMcAru. aMjalIdEvi kUDA sannivESa prAdhAnyaMgA kanipistuMdI pATalO. sinimAlO pATalannI telugu pallavulatO uMDi I oka pATaku mAtraM pallavi 'sOjA' anna padAnni upayOgiMcaTaM venaka 'jiMdagI' (1940) sinimAlO paMkaj mallika saMgIta darSakatvaMlO ke.el. saigal pADina 'sOjA rAjakumArI sOjA' anE pATa praBAvaM uMdanukOvaTaMlO tappulEdanipistOMdi.
ఈ పాటను ఏ.ఎం.రాజా పాడగా అక్కినేని అభినయించారు. అంజలీదేవి కూడా సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తుందీ పాటలో. సినిమాలో పాటలన్నీ తెలుగు పల్లవులతో ఉండి ఈ ఒక పాటకు మాత్రం పల్లవి 'సోజా' అన్న పదాన్ని ఉపయోగించటం వెనక 'జిందగీ' (1940) సినిమాలో పంకజ్ మల్లిక సంగీత దర్శకత్వంలో కె.ఎల్. సైగల్ పాడిన 'సోజా రాజకుమారీ సోజా' అనే పాట ప్రభావం ఉందనుకోవటంలో తప్పులేదనిపిస్తోంది.
'సోజా నా మనోహరి సోజా' అనే పాట ఆలాపనలోనూ, ఇంటర్లూడ్స్లోనూ బహార్ రాగచ్ఛాయలు పల్లవి, చరణాలలో మధ్యమావతి రాగధోరణులు కనిపిస్తాయి. అయితే చరణాల చివర బృందగాన సారంగ రాగమేమో అనిపించే అవకాశం ఉంది. అయితే ఆ రాగ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించినందున నిర్థారించలేం. ఏది ఏమైనా ఏ.ఎం.రాజా పాడిన మెలోడిస్లో ఈ పాటకు ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి తీరాలి.