Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
I pATaku mAtRuka hiMdI 'anArkali' lO gItAdat pADina 'O jAnevaPA' ayinA - telugulOki vaccEsariki pUrtigA jikki pATa ayipOyiMdi. kAvAlaMTE reMDu pATalanu okEsAri peTTukuni vinaDaM taTasthistE appuDu arthaM avutuMdi idi eMduku jikki pATa ayipOyiMdO!? muKyaMgA 'saKA' anE padaM.... aMdulO 'Ka' anE akSharaM... jikki goMtutO palikinaMta goppagA maroka gAyani gaLaMlO palakadu.
idilA uMDagA telugu pATalO unna Upu, jIvaM hiMdIlO aMtagA gOcariMcadu. toluta vaccina pATani anusaristunnappuDu meruguparucukunE avakASaM tarvAta vaccina pATaku uMDaDaMtO pATu - adi samarthula cEtilO paDitE tadvArA kaligE sogasulE vEru, kaLyANi svarAlanu akkaDakkaDa kalupukuMTU mOhana rAgaM pradhAnaMgA sAgina I pATalO avannI gamaniMcavaccu.
ఈ పాటకు మాతృక హిందీ 'అనార్కలి' లో గీతాదత్ పాడిన 'ఓ జానెవఫా' అయినా - తెలుగులోకి వచ్చేసరికి పూర్తిగా జిక్కి పాట అయిపోయింది. కావాలంటే రెండు పాటలను ఒకేసారి పెట్టుకుని వినడం తటస్థిస్తే అప్పుడు అర్థం అవుతుంది ఇది ఎందుకు జిక్కి పాట అయిపోయిందో!? ముఖ్యంగా 'సఖా' అనే పదం.... అందులో 'ఖ' అనే అక్షరం... జిక్కి గొంతుతో పలికినంత గొప్పగా మరొక గాయని గళంలో పలకదు.
ఇదిలా ఉండగా తెలుగు పాటలో ఉన్న ఊపు, జీవం హిందీలో అంతగా గోచరించదు. తొలుత వచ్చిన పాటని అనుసరిస్తున్నప్పుడు మెరుగుపరుచుకునే అవకాశం తర్వాత వచ్చిన పాటకు ఉండడంతో పాటు - అది సమర్థుల చేతిలో పడితే తద్వారా కలిగే సొగసులే వేరు, కళ్యాణి స్వరాలను అక్కడక్కడ కలుపుకుంటూ మోహన రాగం ప్రధానంగా సాగిన ఈ పాటలో అవన్నీ గమనించవచ్చు.