Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : P. Adi Narayana Rao / పి . ఆదినారాయణ రావు ,
Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,
Song Category : Others
Song- Ragam :
ఈ పాటను జిక్కీ పాడగా అంజలీదేవి అభినయించింది. యస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు, సురభి బాలసరస్వతి, పేకేటి మొదలైనవారు సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. రాజ్కుమార్ తీసిన 'బర్సాత్' (1949) చిత్రంలో శంకర్ - జైకిషన్ స్వరపరచగా లతా పాడిన 'మేరే ఆంఖోమే బస్ గయా కోయిరే' అనే పాటలోని తొలిలైను ట్యూనుని గుర్తు చేస్తూ ఈ 'తాగి తూగేనని తలచేను లోకము' పాట సాగుతుంది.
మిగిలిన పాటలలోలాగే జిక్కీ సామర్థ్యాన్ని చూపించే పాటయింది. ఈ పాటకు 'పహాడీ' రాగం ఆధారం. అయితే లలిత సంగీతంలో స్వతంత్ర సంచారం చేసుకునే వీలుంది కనుక కొన్ని అన్యస్వరాలను కలుపుకుంటూ 'మిశ్రపహాడీ' గా రూపొందింది ఈ పాట. పైన ఉదహరించిన పాటలే కాక 'అందచందాలు కని', 'కలిసె నెలరాజు కలువ చెలిని' వంటి పాటలను కూడా ఇప్పుడు విన్నా బాగుండే పాటలుగా చెప్పుకోవచ్చు.