Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Susarla Dakshina Murthy / సుసర్ల దక్షిణా మూర్తి ,
Lyrics Writer : Vaddadhi / వడ్డాది ,
Singer : P. Leela / పి. లీల , P.Suseela / పి. సుశీల , Raghunath Panigrahi / రఘునాధ పాణిగ్రాహి ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATanu lIla, raGunAdha pANigrahi, suSIla pADAru. vaDDAdi rAsina I pATanu terapai aMjalIdEvi, akkinEni, jamuna aBinayiMcAru. telugu sinIsaMgIta caritralO trigaLa gItAlu ati takkuva. aMdulO bAgunnavi. AyuHpramANaM adhikaMgA kaligi unnavi marI marI takkuva.
aTuvaMTi pATalanu lekkiMcavalasivastE I pATanu udahariMcakuMDA muMduku sAgaDaM kaShTaM. BIMplAs rAgaM skEl AdhAraMgA malacabaDDa I pATa dvArA raGunAdha pANigrahi aMdarikI teliSADu. orissAku ceMdina I gAyakuDu pramuKa nRutya kaLAkAriNi saMyuktanu vivAhaM cEsukunnADu. A taruvAta Ame saMyukta pANigrAhigA prasiddhurAlaiMdi. raGunAdha pANigrAhi telugulO pADinavi takkuvE ayinA I pATa dvArA Ayana SrOtala hRudayaMlO cirasthAyigA, sthira sthAyigA nilicipOyADu ekkuvagA AdhyAtmika vAtAvaraNaMlO bratikE aMjalIdEvi pAtra modaTi caraNAnni Amenu prEmiMcina akkinE pAtra reMDava caraNAnni, ataDini prEmiMcE jamuna pAtra mUDava caraNAnni pADaTaM jarugutuMdi. aBinayiMcE pAtrala svaBAvAlu caMdruni UhiMcukuMTU kathAparaMgA elA spaMdistAyi annadE I pATalOni sAhitya sOyagaM.
ఈ పాటను లీల, రఘునాధ పాణిగ్రహి, సుశీల పాడారు. వడ్డాది రాసిన ఈ పాటను తెరపై అంజలీదేవి, అక్కినేని, జమున అభినయించారు. తెలుగు సినీసంగీత చరిత్రలో త్రిగళ గీతాలు అతి తక్కువ. అందులో బాగున్నవి. ఆయుఃప్రమాణం అధికంగా కలిగి ఉన్నవి మరీ మరీ తక్కువ. అటువంటి పాటలను లెక్కించవలసివస్తే ఈ పాటను ఉదహరించకుండా ముందుకు సాగడం కష్టం. భీంప్లాస్ రాగం స్కేల్ ఆధారంగా మలచబడ్డ ఈ పాట ద్వారా రఘునాధ పాణిగ్రహి అందరికీ తెలిశాడు. ఒరిస్సాకు చెందిన ఈ గాయకుడు ప్రముఖ నృత్య కళాకారిణి సంయుక్తను వివాహం చేసుకున్నాడు.
ఆ తరువాత ఆమె సంయుక్త పాణిగ్రాహిగా ప్రసిద్ధురాలైంది. రఘునాధ పాణిగ్రాహి తెలుగులో పాడినవి తక్కువే అయినా ఈ పాట ద్వారా ఆయన శ్రోతల హృదయంలో చిరస్థాయిగా, స్థిర స్థాయిగా నిలిచిపోయాడు ఎక్కువగా ఆధ్యాత్మిక వాతావరణంలో బ్రతికే అంజలీదేవి పాత్ర మొదటి చరణాన్ని ఆమెను ప్రేమించిన అక్కినే పాత్ర రెండవ చరణాన్ని, అతడిని ప్రేమించే జమున పాత్ర మూడవ చరణాన్ని పాడటం జరుగుతుంది. అభినయించే పాత్రల స్వభావాలు చంద్రుని ఊహించుకుంటూ కథాపరంగా ఎలా స్పందిస్తాయి అన్నదే ఈ పాటలోని సాహిత్య సోయగం.