Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Rajasulochana / రాజసులోచన , Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) , P.Suseela / పి. సుశీల ,
Song Category : Children Songs
Song- Ragam :
I pATanu SrISrI rAyagA suSIla, jikki AlapiMcAru. sAvitri, girija aBinayiMcAru. sannivESa prAdhAnyaMgA sUryakAMtaM, mugguru cinnapillalu EDAdilOpu, reMDu mUDELLalOpu, ayidArELLa lOpu pillalu kanipistAru. puTTi perugutunna pillavANNi peMcutunna kannatalli hRudayaM, A pillavADipai mamakAraM peMcukunna marO mAtRuhRudayaM - spaMdistE eTuvaMTi BAvAlu kalugutAyO vATinE akShara rUpaMlO aMdiMcAru SrISrI. parakAya pravESa vidya maMci kaviki aMtarlInaMgA uMTuMdanaTAniki I pATa O udAharaNa. ikkaDa AnATi viluvala guriMci marOsAri ceppukOvAli.
pATa modaTlO mA pApAyi bOsinanavvule maMci mutyamula vAnalu - ani uMTuMdi. tarvAta nuMci - mA pApAyi navvu puvvale maMci mutyamula vAnalu - gA A lainu rUpAMtaraM ceMdutuMdi. aMduku kAraNaM - pillavADu perigi bOsi navvula sthAyi nuMDi paLLoccAka aMdaMgA navvETaMtagA peddavADayyADu - ani esTAbliSh ceyyAlanukOvaTamE! nirmAta, darSakuDu, pATala racayita kalisi kUrcuni anukuMTEnE gAni iMta lOtaina avagAhana kalagadu. AnADu unnadI, InADu koravaDutunnadI adE!
I pATanu vakuLABaraNaM rAgaM AdhAraMgA svaraparicAru. 'iMTanu velisina dIpamu' caraNAniki cakravAka rAgAnni, 'nOcina nOmulu paMDagA' caraNaM vadda mAyA mALava rAgAnni spRuSiMcinA vakuLABaraNa rAgAnnE pradhAnaMgA cEsukuni pATanu naDapaDaM jarigiMdi. I pATaku beMgAlIlO gItAray pADina 'kAjal kAjal kum kum' anE praivET gItaM TyUn AdhAraM ani SrI.vi.e.ke. raMgArAvu tana 'AlApana' SIrShikalO pErkonnAru.
ఈ పాటను శ్రీశ్రీ రాయగా సుశీల, జిక్కి ఆలపించారు. సావిత్రి, గిరిజ అభినయించారు. సన్నివేశ ప్రాధాన్యంగా సూర్యకాంతం, ముగ్గురు చిన్నపిల్లలు ఏడాదిలోపు, రెండు మూడేళ్ళలోపు, అయిదారేళ్ళ లోపు పిల్లలు కనిపిస్తారు. పుట్టి పెరుగుతున్న పిల్లవాణ్ణి పెంచుతున్న కన్నతల్లి హృదయం, ఆ పిల్లవాడిపై మమకారం పెంచుకున్న మరో మాతృహృదయం - స్పందిస్తే ఎటువంటి భావాలు కలుగుతాయో వాటినే అక్షర రూపంలో అందించారు శ్రీశ్రీ. పరకాయ ప్రవేశ విద్య మంచి కవికి అంతర్లీనంగా ఉంటుందనటానికి ఈ పాట ఓ ఉదాహరణ.
ఇక్కడ ఆనాటి విలువల గురించి మరోసారి చెప్పుకోవాలి. పాట మొదట్లో మా పాపాయి బోసిననవ్వులె మంచి ముత్యముల వానలు - అని ఉంటుంది. తర్వాత నుంచి - మా పాపాయి నవ్వు పువ్వలె మంచి ముత్యముల వానలు - గా ఆ లైను రూపాంతరం చెందుతుంది. అందుకు కారణం - పిల్లవాడు పెరిగి బోసి నవ్వుల స్థాయి నుండి పళ్ళొచ్చాక అందంగా నవ్వేటంతగా పెద్దవాడయ్యాడు - అని ఎస్టాబ్లిష్ చెయ్యాలనుకోవటమే! నిర్మాత, దర్శకుడు, పాటల రచయిత కలిసి కూర్చుని అనుకుంటేనే గాని ఇంత లోతైన అవగాహన కలగదు. ఆనాడు ఉన్నదీ, ఈనాడు కొరవడుతున్నదీ అదే!
ఈ పాటను వకుళాభరణం రాగం ఆధారంగా స్వరపరిచారు. 'ఇంటను వెలిసిన దీపము' చరణానికి చక్రవాక రాగాన్ని, 'నోచిన నోములు పండగా' చరణం వద్ద మాయా మాళవ రాగాన్ని స్పృశించినా వకుళాభరణ రాగాన్నే ప్రధానంగా చేసుకుని పాటను నడపడం జరిగింది. ఈ పాటకు బెంగాలీలో గీతారయ్ పాడిన 'కాజల్ కాజల్ కుమ్ కుమ్' అనే ప్రైవేట్ గీతం