Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి , Vyjayanthimala / వైజయంతిమాల ,
Music Director : Sudarshanam / సుదర్శనం ,
Lyrics Writer : Tholeti / తోలేటి ,
Singer : P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu suSIla pADagA vaijayiMtimAla aBinayiMciMdi. saMgItaparaMgA, sAhityaparaMgA, gAnaparaMgA sinimAlOgala pATalanniTilO peddapITa vEyadagga pATa idi. nijAniki I pATanu A taraMlO koMdaru tappa cAlAmaMdi maracipOyAru. okkasAri tirigi I pATanu maLLI vinaDaM jarigitE alA maricipOyinaMduku bAdhapaDatAru kUDA! AgasTu 15ki janavari 26ki jAtIya patAkAnni eguravEsE samayAna I pATanu AlapiMci tIrAlani (AMdhrapradESlO) rUlu peTTadaggaMta maMci, goppa pATa idi.
'ilalO sATi lEni BAratadESaM' aMTU reMDu rakAlugA kaMpOj ayina TyUn - 'mAdESaM' aMTU TyUn paraMgA tIsukunna malupuki TOn paraMgA jata cEsina bEs - 'BagavadgIta....' anE caraNAniki kaLyANi rAgaMlO kalagalisina kammadanaM - civarna jODiMcina tillAnA ivannI I pATaku aMdaMgA amarina ABaraNAlu.
ఈ పాటను సుశీల పాడగా వైజయింతిమాల అభినయించింది. సంగీతపరంగా, సాహిత్యపరంగా, గానపరంగా సినిమాలోగల పాటలన్నిటిలో పెద్దపీట వేయదగ్గ పాట ఇది. నిజానికి ఈ పాటను ఆ తరంలో కొందరు తప్ప చాలామంది మరచిపోయారు. ఒక్కసారి తిరిగి ఈ పాటను మళ్ళీ వినడం జరిగితే అలా మరిచిపోయినందుకు బాధపడతారు కూడా! ఆగస్టు 15కి జనవరి 26కి జాతీయ పతాకాన్ని ఎగురవేసే సమయాన ఈ పాటను ఆలపించి తీరాలని (ఆంధ్రప్రదేశ్లో) రూలు పెట్టదగ్గంత మంచి, గొప్ప పాట ఇది.
'ఇలలో సాటి లేని భారతదేశం' అంటూ రెండు రకాలుగా కంపోజ్ అయిన ట్యూన్ - 'మాదేశం' అంటూ ట్యూన్ పరంగా తీసుకున్న మలుపుకి టోన్ పరంగా జత చేసిన బేస్ - 'భగవద్గీత....' అనే చరణానికి కళ్యాణి రాగంలో కలగలిసిన కమ్మదనం - చివర్న జోడించిన తిల్లానా ఇవన్నీ ఈ పాటకు అందంగా అమరిన ఆభరణాలు.