This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Velugu-Needalu
Song » Chitti potti chinnari / చిట్టీ పొట్టీ చిన్నారి
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu kUDA SrISrIyE rAyagA suSIla, svarNalata AlapiMcAru. sAvitri, girija pATanu aBinayiMcagA akkinEni nAgESvararAvu, sUryakAMtaM maroka cinnabAbu sannivESaMlO pAlgoni tamavaMtu aBinayAnni aMdiMcAru. caraNAlalO mOhana rAgAnni spRuSiMcaDaM, 'vEDukagA I pUTA ADudamA doMgATA' anE vAkyAnni reMDu sthAyilalO suSIlatO palikiMcaTaM peMDyAla rasadRuShTiki nidarSanaM.

eMdukaMTE alA reMDu sthAyilalO mAdhuryaM taggakuMDA, koMDokacO perugutu^^U pADaDaM konni strI kaMThAlaku mAtramE napputuMdi. udAharaNaku 'BalE ammAyilu' citraMlOni 'madi uyyAlalUge nava BAvAlEvO rEgE' pATalO 'prEmalO karigipOvudamA... BEdamE maracipOvudamA' anE lainlani pi.lIlatO yas.rAjESvararAvu pADiMcina vidhAnAnni gurtuku teccukOMDi.

O cinnapillavADiki puTTinarOju saMdarBaMgA kaLLaku gaMtalu kaTTukuni doMgATa ADE sannivESAniki saripaDETTugAnE kAkuMDA vyaktitva vikAsAniki tODpaDE viShayAlanu kUDA parOkShaMgA aMdiMcAru SrISrI. curukudanaM, buddhibalaM uMTEnE cAlu - cUDakanE teliyu kadA nijAnijAlu/ kannulaMDi cUDalEru koMtamaMdi janaM - dAri tappi taragaDamE telivitEnitanaM/ guri telisi masalukunE nidAnamE nIti... lAMTi vAkyAlu mana nitya jIvitaMlO ennOsArlu anuBavaMlOki vaccuMTAyO kadA...alAgE BaviShyattulO kUDA ika evarikI vITi avasaraM rAdani ceppalEM kadA... SASvatatvaM aMTE adI... aTuvaMTi akShara jyOtulni manalO veligiMcina AnATi kavulanu ivALTikI manaM talcukuni talcukuni murisipOtU kannILLu peTTukOvaTAniki kAraNaM kUDA adE.!

Important information - Telugu

ఈ పాటను కూడా శ్రీశ్రీయే రాయగా సుశీల, స్వర్ణలత ఆలపించారు. సావిత్రి, గిరిజ పాటను అభినయించగా అక్కినేని నాగేశ్వరరావు, సూర్యకాంతం మరొక చిన్నబాబు సన్నివేశంలో పాల్గొని తమవంతు అభినయాన్ని అందించారు. చరణాలలో మోహన రాగాన్ని స్పృశించడం, 'వేడుకగా ఈ పూటా ఆడుదమా దొంగాటా' అనే వాక్యాన్ని రెండు స్థాయిలలో సుశీలతో పలికించటం పెండ్యాల రసదృష్టికి నిదర్శనం. ఎందుకంటే అలా రెండు స్థాయిలలో మాధుర్యం తగ్గకుండా, కొండొకచో పెరుగుతుఊ పాడడం కొన్ని స్త్రీ కంఠాలకు మాత్రమే నప్పుతుంది. ఉదాహరణకు 'భలే అమ్మాయిలు' చిత్రంలోని 'మది ఉయ్యాలలూగె నవ భావాలేవో రేగే' పాటలో 'ప్రేమలో కరిగిపోవుదమా... భేదమే మరచిపోవుదమా' అనే లైన్లని పి.లీలతో యస్.రాజేశ్వరరావు పాడించిన విధానాన్ని గుర్తుకు తెచ్చుకోండి.


ఓ చిన్నపిల్లవాడికి పుట్టినరోజు సందర్భంగా కళ్ళకు గంతలు కట్టుకుని దొంగాట ఆడే సన్నివేశానికి సరిపడేట్టుగానే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విషయాలను కూడా పరోక్షంగా అందించారు శ్రీశ్రీ. చురుకుదనం, బుద్ధిబలం ఉంటేనే చాలు - చూడకనే తెలియు కదా నిజానిజాలు/ కన్నులండి చూడలేరు కొంతమంది జనం - దారి తప్పి తరగడమే తెలివితేనితనం/ గురి తెలిసి మసలుకునే నిదానమే నీతి... లాంటి వాక్యాలు మన నిత్య జీవితంలో ఎన్నోసార్లు అనుభవంలోకి వచ్చుంటాయో కదా...అలాగే భవిష్యత్తులో కూడా ఇక ఎవరికీ వీటి అవసరం రాదని చెప్పలేం కదా... శాశ్వతత్వం అంటే అదీ... అటువంటి అక్షర జ్యోతుల్ని మనలో వెలిగించిన ఆనాటి కవులను ఇవాళ్టికీ మనం తల్చుకుని తల్చుకుని మురిసిపోతూ కన్నీళ్ళు పెట్టుకోవటానికి కారణం కూడా అదే.!