Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి , Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Arudra / ఆరుద్ర ,
Singer : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి ,
Song Category : Devotional Songs
Song- Ragam :
I pATaku gAnaM, aBinayaM reMDU es. varalakShmE! madhyamAvati rAgaM I pATaku AdhAraM. I pATalO kUDA yas.varalakShmi gAnaM cEsina vidhAnaM kamanIyaM, gamanIyaM. ippuDu vADukalO lEni konni konni padAla guriMci telusukOvAlaMTE ilAMTi pATalu vinaTaM cAlA avasaraM. lEkapOtE vanaru, pasaramu vaMTi padAlaku arthaM ceppAlaMTE niGaMTuvulu vetukkOvalasina paristhiti vastuMdi. 'kOrukunna vAri veMTa gOvulAge vastuMdi' anE padaprayOgaM okarakaMgA camatkAraM. eMdukaMTE akkaDa gOvu rUpaMlO unnadi SivuDu kanuka. alAgE citrIkaraNaparaMgA iMkOmATa ceppukOvAlikkaDa. I pATalO yas. varalakShmi Avunu guriMci pADutU unnA dUDanu lAliMcE dRuSyAlu ekkuvagA uMTAyi. darSakatva pratiBaku saMbaMdhiMcina kONaMlO AlOcistE - dUDa rUpaM dhariMciMdi brahma... mAruvEShaMlO 'amma'gA vaccinAme lakShmIdEvi. mari lakShmIdEviki brahma... putruDEgA?!
ఈ పాటకు గానం, అభినయం రెండూ ఎస్. వరలక్ష్మే! మధ్యమావతి రాగం ఈ పాటకు ఆధారం. ఈ పాటలో కూడా యస్.వరలక్ష్మి గానం చేసిన విధానం కమనీయం, గమనీయం. ఇప్పుడు వాడుకలో లేని కొన్ని కొన్ని పదాల గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి పాటలు వినటం చాలా అవసరం. లేకపోతే వనరు, పసరము వంటి పదాలకు అర్థం చెప్పాలంటే నిఘంటువులు వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. 'కోరుకున్న వారి వెంట గోవులాగె వస్తుంది' అనే పదప్రయోగం ఒకరకంగా చమత్కారం. ఎందుకంటే అక్కడ గోవు రూపంలో ఉన్నది శివుడు కనుక. అలాగే చిత్రీకరణపరంగా ఇంకోమాట చెప్పుకోవాలిక్కడ. ఈ పాటలో యస్. వరలక్ష్మి ఆవును గురించి పాడుతూ ఉన్నా దూడను లాలించే దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. దర్శకత్వ ప్రతిభకు సంబంధించిన కోణంలో ఆలోచిస్తే - దూడ రూపం ధరించింది బ్రహ్మ... మారువేషంలో 'అమ్మ'గా వచ్చినామె లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవికి బ్రహ్మ... పుత్రుడేగా?!