Actor : Edida Sriram / ఏడిద శ్రీరామ్ ,
Actress : Seetha / సీత ,
Music Director : Ganagai Amaran / గంగై అమరన్ ,
Lyrics Writer : Jonnavithulla / జొన్నవిత్తుల ,
Singer : S p balu / యస్ పి బాలు , S. Janaki / యస్. జానకి ,
Song Category : Special Experimental Songs
Song- Ragam :
సప్తస్వరాలను తీసుకొని వాటితో పూర్తిగా ఓ పాటను రాసిన తొలి తెలుగు సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. సప్తస్వరాలకు అర్థాలు ఉండవని చాలామంది అనుకుంటారు. కాని అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదని ఆ స్వరాలకు కూడా అర్థాలు ఉంటాయని నిరూపించారాయన.
సరిగమపదని... అనే ఈ ఏడు స్వరాలను రాగం తప్పకుండా అర్ధవంతమైన పదాలుగా తయారుచేయడం అంత సులువైన ప్రక్రియ కాదు. స్వరాలను పదాలుగా మార్చి భాషతో చెడుగుడు ఆడుకున్నారు జొన్నవిత్తుల ఈ పాటలో. ఉదాహరణకు... సాగనీ, పదమనీ, దాగనీ, నీ దానినీ, నిగనిగ, మానిని, దా మరి, సరిదానిని... వీటిని చూస్తే, పైకి స్వరాల కూర్పులాగే అనిపిస్తుంది కానీ సరిగా అర్థం చేసుకుంటే అందులో దాగి ఉన్న పదం, ఆ పదం యొక్క అర్ధం స్పష్టంగా తెలుస్తుంది. . ఇది సినీ సంగీత సాహిత్యంలో సరికొత్త ప్రయోగం గా చెప్పుకోదగ్గ స్వరాక్షర ప్రయోగం