Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : TV. Raju / టి.వి.రాజు ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : Ghantasala / ఘంటసాల , Ravu Baalasaraswathi devi / రావు బాలసరస్వతి దేవి ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATa GaMTasAla, rAvubAlasarasvati dEvi pADagA en.Ti.Ar, vahIdA rehamAn aBinayiMcAru. I pATalOni reMDu caraNAlaku konasAgiMpulA aMjalIdEvi aBinayiMcagA 'miMTipainA velugAripOyE' anE maroka caraNaM kUDA vastuMdi. A caraNaM hec.eM.vi vAru viDudala cEsina ADiyO kyAseTlO lEdu. I mUDu caraNAlu pradhAnaMgA mOhanarAgaM painE AdhArapaDi uMTAyi.
O vaipu aMdarinI AkarsiMcagaligE 'I nATi I hAyi' lAMTi pATaku mOhanarAgAnni pUrtigA vADukuMTU aBiruci vunna koMtamaMdiki mAtramE ruciMcagaligE I 'madilOni madhura BAvaM' lAMTi pATaki kUDA mOhanarAgAnni upayOgiMcaTaM, aMdulOnU... AnaMda viShAdAlu reMDU pratiPaliMcETTugA ivannI Ti.vi.rAju gAripai gala gauravAnni reTTiMpu cEstAyi.
ఈ పాట ఘంటసాల, రావుబాలసరస్వతి దేవి పాడగా ఎన్.టి.ఆర్, వహీదా రెహమాన్ అభినయించారు. ఈ పాటలోని రెండు చరణాలకు కొనసాగింపులా అంజలీదేవి అభినయించగా 'మింటిపైనా వెలుగారిపోయే' అనే మరొక చరణం కూడా వస్తుంది. ఆ చరణం హెచ్.ఎం.వి వారు విడుదల చేసిన ఆడియో క్యాసెట్లో లేదు. ఈ మూడు చరణాలు ప్రధానంగా మోహనరాగం పైనే ఆధారపడి ఉంటాయి.
ఓ వైపు అందరినీ ఆకర్సించగలిగే 'ఈ నాటి ఈ హాయి' లాంటి పాటకు మోహనరాగాన్ని పూర్తిగా వాడుకుంటూ అభిరుచి వున్న కొంతమందికి మాత్రమే రుచించగలిగే ఈ 'మదిలోని మధుర భావం' లాంటి పాటకి కూడా మోహనరాగాన్ని ఉపయోగించటం, అందులోనూ... ఆనంద విషాదాలు రెండూ ప్రతిఫలించేట్టుగా ఇవన్నీ టి.వి.రాజు గారిపై గల గౌరవాన్ని రెట్టింపు చేస్తాయి.