Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా , P.Suseela / పి. సుశీల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
'bRuMdAvanamadi aMdaridi' pATanu E.yam.rAjA, suSIla pADagA en.Ti.Ar, jamuna aBinayiMcAru. sAvitri, akkinEni, yas.vi raMgArAvu, RuShyEMdramaNi sannivESa prAdhAnyaMgA kanipistAru. idi teluguvAraMdarU garvaMgA ceppukOgala gItaM. eMdukaMTE 'missamma' citrAnni hiMdIlO 'mis mErI'gA tIsinapuDu A hiMdI citrAniki saMgIta darSakuDaina hEmaMt kumAr migilina pATalanniMTikI vErE TyUns iccAru.
'బృందావనమది అందరిది' పాటను ఏ.యమ్.రాజా, సుశీల పాడగా ఎన్.టి.ఆర్, జమున అభినయించారు. సావిత్రి, అక్కినేని, యస్.వి రంగారావు, ఋష్యేంద్రమణి సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. ఇది తెలుగువారందరూ గర్వంగా చెప్పుకోగల గీతం. ఎందుకంటే 'మిస్సమ్మ' చిత్రాన్ని హిందీలో 'మిస్ మేరీ'గా తీసినపుడు ఆ హిందీ చిత్రానికి సంగీత దర్శకుడైన హేమంత్ కుమార్ మిగిలిన పాటలన్నింటికీ వేరే ట్యూన్స్ ఇచ్చారు.
కానీ ఈ పాట ట్యూన్ను మాత్రం యధాతథంగా తీసుకుని 'బృందావన్ కా కృష్ణ్ కన్హయా' అనే పాటగా మలుచుకోలేక తప్పలేదాయనకి. సామరాగంలో స్వరపరచబడిన ఈ పాట సాహిత్యాన్ని ఒ పక్కన పెట్టేస్తే వరసంతా ఏమాత్రం వైవిధ్యం లేకుండా ఒకేలా ఉంటుంది. అయినా సరే అదొక హంటింగ్ ట్యూన్లా మారిందంటే ఆ స్వరబలం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మొత్తం 'సదప, పదస' అనే స్వరాల మధ్యనే తిరగడం ఓ విశేషం.