Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు , NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jamuna / జమున , Savithri / సావిత్రి ,
Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
strI manastatvAnni manOnEtraMtO vIkShiMci pratI vAkyamoka SAstrakAruni BAShyaMlA rUpoMdiMcina pATa 'aunaMTE kAdanilE, kAdaMTE aunanilE'! I pATalOni 'ADavAri mATalaku arthAlE vErulE' anE vAkyaM eMta pApular ayiMdaMTE A mATanu O sAmetalAgA, O sUktilAgA vADamE kAka, nijaMgA asaladi O sAmeta ani BAviMcEvALLu kUDA eMtOmaMdi unnAru. vAriki piMgaLi, sAlUri, E.yaM.rAjA, enTI^^Ar, vijayavAru, 'missamma' guriMci teliyakapOvaccu.
స్త్రీ మనస్తత్వాన్ని మనోనేత్రంతో వీక్షించి ప్రతీ వాక్యమొక శాస్త్రకారుని భాష్యంలా రూపొందించిన పాట 'ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే'! ఈ పాటలోని 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' అనే వాక్యం ఎంత పాపులర్ అయిందంటే ఆ మాటను ఓ సామెతలాగా, ఓ సూక్తిలాగా వాడమే కాక, నిజంగా అసలది ఓ సామెత అని భావించేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వారికి పింగళి, సాలూరి, ఏ.యం.రాజా, ఎన్టీఆర్, విజయవారు, 'మిస్సమ్మ' గురించి తెలియకపోవచ్చు.
కానీ ఆ వాక్యం 'మిస్సమ్మ' ద్వారానే తెలుగువారికి అందిందంటే నమ్మలేరు. అంతటి శాశ్వత స్థానం తెలుగు భాషలో సంపాదించుకుంది ఆ వాక్యం. జానపద సంగీత పోకడలను నవీనం చేస్తూ మలచబడ్డ ఈ పాటకు 'పీలూ' రాగం ఆధారం. ఈ కాలంలో కూడా పవన్ కళ్యాణ్ 'ఖుషీ'లో ఈ తరానికి తెలిసిన విషయాలే అయినా ఈ పాటకున్న 'బలం ఇదీ' అని ఓసారి మననం చేసుకోటానికే ఈ ప్రస్తావన! ఏ.యమ్.రాజా పాడిన ఈ పాటను ఎన్.టి.ఆర్, రేలంగి అభినయించారు.