Actor : Group Artistes / ఉప పాత్రధారులు , Master Babji / మాస్టర్ బాబ్జి , NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Group Artistes / ఉప పాత్రధారులు , Savithri / సావిత్రి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer :
Song Category : Others
Song- Ragam :
SrIkRuShNuni cinnanATi muccaTlu SrIkRuShNuni eduTE O aMtarnATakaMlA pradarSiMcaTaM, yAdava kuTuMbamaMtA maimaraci cUstuMDagA - niMDu koluvulO draupadi vastrApaharaNaM jarugutunnaTTu ikkaDa SrIkRuShNuniki teliyaTaM, tadvArA pAMDavulu tama rAjyAlanu kOlpOyArani I pATa dvArA cUpistAru. tilaMg rAgaMlO modalai 'kAligajjela saMdaDi cEyaka' daggara cArukESi rAgAnni aMdukuni 'BAmalaMdaroka yuktini panni' daggara pIlU rAgAnni spRuSistU, 'kALiMdi maDuguna viShamunu kalipe' daggara SaMkarABaraNaM svarAlapai naDustU pATa mottaM jAnapada saMgIta dhOraNilO saMcaristU uMTuMdi.
శ్రీకృష్ణుని చిన్ననాటి ముచ్చట్లు శ్రీకృష్ణుని ఎదుటే ఓ అంతర్నాటకంలా ప్రదర్శించటం, యాదవ కుటుంబమంతా మైమరచి చూస్తుండగా - నిండు కొలువులో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నట్టు ఇక్కడ శ్రీకృష్ణునికి తెలియటం, తద్వారా పాండవులు తమ రాజ్యాలను కోల్పోయారని ఈ పాట ద్వారా చూపిస్తారు. తిలంగ్ రాగంలో మొదలై 'కాలిగజ్జెల సందడి చేయక' దగ్గర చారుకేశి రాగాన్ని అందుకుని 'భామలందరొక యుక్తిని పన్ని' దగ్గర పీలూ రాగాన్ని స్పృశిస్తూ, 'కాళింది మడుగున విషమును కలిపె' దగ్గర శంకరాభరణం స్వరాలపై నడుస్తూ పాట మొత్తం జానపద సంగీత ధోరణిలో సంచరిస్తూ ఉంటుంది.