This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Mayabazaar
Song » Neekosame jeevinchunadi / నీకోసమే జీవించునది
Click To Rate




* Voting Result *
16.67 %
16.67 %
16.67 %
16.67 %
33.33 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu GaMTasAla, lIla AlapiMcagA - akkinEni nAgESvararAvu, sAvitri aBinayiMcAru. I pATa BAgISvari, cArukESi  rAgAlalO svaraparacabaDiMdi. hRudayamu nItO veDalipOyinA, melukuvanainA kalalOnainA kolutunu. ninnE praNaya  dEvigA anE vAkyAlaku cArukESi rAgAnni - migilina pATaku BAgISvari rAgAnni upayOgiMcAru. GaMTasAla saMgIta  darSakuDigA aMtaku muMdu viDudalayina 'ShAvukAru' citraMlO 'evarO....vArE' pATalO cArukESi rAgAnni upayOgiMcina  paddhati, tarvAti rOjullO viDudalayina 'lavakuSa' citraMlO 'SrIrAma suguNadhAma raGuvaMSa jaladhisOmA' pATalOnu 'SrI  satyanArAyaNa vrata mahatmyaM' citraMlO 'OM namOnArAyaNa' pATalOnu BAgISvari rAgAnni vADukunna vidhAnaM ivannI  AyA rAgAlalO vAri sRujanAtmaka saMcArAniki addaM paTTEvE!


akSharAlanu amRutadhAralugA anvayiMci rAsE piMgaLi pALi veluvariMcina 'virahamu kUDA suKamE kAdA, niratamu  ciMtana madhuramu kAdA' lAMTi vAkyAlu - manuShullO prEma tatvaM, telugu sinIgItAlalO sAhitI sSarSa  unnaMtavarakU ajarAmaraMgA uMTAyi.
Important information - Telugu

 ఈ పాటను ఘంటసాల, లీల ఆలపించగా - అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించారు. ఈ పాట భాగీశ్వరి, చారుకేశి రాగాలలో స్వరపరచబడింది. హృదయము నీతో వెడలిపోయినా, మెలుకువనైనా కలలోనైనా కొలుతును. నిన్నే ప్రణయ దేవిగా అనే వాక్యాలకు చారుకేశి రాగాన్ని - మిగిలిన పాటకు భాగీశ్వరి రాగాన్ని ఉపయోగించారు. ఘంటసాల సంగీత దర్శకుడిగా అంతకు ముందు విడుదలయిన 'షావుకారు' చిత్రంలో 'ఎవరో....వారే' పాటలో చారుకేశి రాగాన్ని ఉపయోగించిన పద్ధతి, తర్వాతి రోజుల్లో విడుదలయిన 'లవకుశ' చిత్రంలో 'శ్రీరామ సుగుణధామ రఘువంశ జలధిసోమా' పాటలోను 'శ్రీ సత్యనారాయణ వ్రత మహత్మ్యం' చిత్రంలో 'ఓం నమోనారాయణ' పాటలోను భాగీశ్వరి రాగాన్ని వాడుకున్న విధానం ఇవన్నీ ఆయా రాగాలలో వారి సృజనాత్మక సంచారానికి అద్దం పట్టేవే!


అక్షరాలను అమృతధారలుగా అన్వయించి రాసే పింగళి పాళి వెలువరించిన 'విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా' లాంటి వాక్యాలు - మనుషుల్లో ప్రేమ తత్వం, తెలుగు సినీగీతాలలో సాహితీ స్శర్శ ఉన్నంతవరకూ అజరామరంగా ఉంటాయి.