This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Jagadeka-veeruni-katha
Song » Varinchi vachina maanava / వరించి వచ్చిన మానవ
Click To Rate




* Voting Result *
10.00 %
10.00 %
10.00 %
10.00 %
60.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 I pATanu pi.lIla, pi.suSIla, bRuMdaM AlapiMcagA bi.sarOjAdEvi, yal.vijayalakShmi jayaMti, bAla aBinayiMcAru. I pATanu madhyamAvati rAgaMlO svaraparicAru. ayitE A rAgaMlO rAkUDani gAMdhAra, daivata svarAlanu vinasoMpugA uMDaTaM kOsaM jatacEsukOvaTaM jarigiMdi. I pATanu koMdaru 'aune celi aune saKI' aMTU pADatAru. nijAniki piMgaLi rAsiMdi. gAyanImaNalu pADiMdi - 'auna celi auna saKI' anE caraNAlalOni vAkyAlaki taruvAta vaccE vAkyAlatO liMku uMDaTaM I pATa pratyEkata. iMkoka viSEShaM EmiTaMTE - konnELla kritaM peMDyAla O patrikalO samAdhAnAlu istunnapuDu 'I pATa modalavaDAniki muMdu vinipiMcE insTrumeMTal myUjik cAlA kottagA uMdaMDI... adi E vAdyaM?' ani koMdaru aDigitE dAnikAyana 'dAnni klEvayolin aMTAru. adi elakTrAnikalgA AparET cEsE vAyidyaM' aMTU samAdhAnamiccAru. 'aMta cinna biT kUDA prEkShakulaki gurtiMDipOyiMdaMTE alAMTi pATalu svaraparicE avakASaM  kaliginaMduku nEneMtO puNyaM cEsukunnAnO' aMTU mitrula madhya jarigE piccApATIlO kannILLu peTTuku marI ceppavAru peMDyAla.

 
Important information - Telugu

ఈ పాటను పి.లీల, పి.సుశీల, బృందం ఆలపించగా బి.సరోజాదేవి, యల్.విజయలక్ష్మి జయంతి, బాల అభినయించారు. ఈ పాటను మధ్యమావతి రాగంలో స్వరపరిచారు. అయితే ఆ రాగంలో రాకూడని గాంధార, దైవత స్వరాలను వినసొంపుగా ఉండటం కోసం జతచేసుకోవటం జరిగింది. ఈ పాటను కొందరు 'ఔనె చెలి ఔనె సఖీ' అంటూ పాడతారు. నిజానికి పింగళి రాసింది. గాయనీమణలు పాడింది - 'ఔన చెలి ఔన సఖీ' అనే చరణాలలోని వాక్యాలకి తరువాత వచ్చే వాక్యాలతో లింకు ఉండటం ఈ పాట ప్రత్యేకత. ఇంకొక విశేషం ఏమిటంటే - కొన్నేళ్ల క్రితం పెండ్యాల ఓ పత్రికలో సమాధానాలు ఇస్తున్నపుడు 'ఈ పాట మొదలవడానికి ముందు వినిపించే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉందండీ... అది ఏ వాద్యం?' అని కొందరు అడిగితే దానికాయన 'దాన్ని క్లేవయొలిన్ అంటారు. అది ఎలక్ట్రానికల్గా ఆపరేట్ చేసే వాయిద్యం' అంటూ సమాధానమిచ్చారు. 'అంత చిన్న బిట్ కూడా ప్రేక్షకులకి గుర్తిండిపోయిందంటే అలాంటి పాటలు స్వరపరిచే అవకాశం  కలిగినందుకు నేనెంతో పుణ్యం చేసుకున్నానో' అంటూ మిత్రుల మధ్య జరిగే పిచ్చాపాటీలో కన్నీళ్ళు పెట్టుకు మరీ చెప్పవారు పెండ్యాల.