Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు ,
Singer : P. Leela / పి. లీల , P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.lIla, pi.suSIla, bRuMdaM pADagA bi.sarOjAdEvi, yal.vijayalakShmi, jayaMti (appuDu kamalakumAri), bAlapai citrIkariMcAru. sannivESa prAdhAnyaMgA madhya madhya en.Ti.Ar. kUDA kanipistAru. pallaviki kIravANi rAgAnni, caraNAlaku naTaBairavi rAgAnni, pallaviki dAritIsE caraNAlalOni AKaru vAkyAlaku tirigi kIravANi rAgAnni upayOgiMcAru. AnATi nuMci InATi varakU sinimAllO snAnaM cEstU pADukunE pATalenni vaccinA sarE I pATa prathama sthAnaMlO uMdaMTE aMduku kAraNaM - vinagAnE nOTiki suluvugA vaccEsE TyUn, viluvalu kOlpOkuMDA sAmAnyuDiki arthamayyElA vADina saraLamaina BASha ani ceppukOvAli. tarvAta vaccina konni sinimAllO I pATa pallavini DailAgski, TyUnni pATala madhya iMTar lUDski vADukOvaTaM kUDA jarigiMdi.
ఈ పాటను పి.లీల, పి.సుశీల, బృందం పాడగా బి.సరోజాదేవి, యల్.విజయలక్ష్మి, జయంతి (అప్పుడు కమలకుమారి), బాలపై చిత్రీకరించారు. సన్నివేశ ప్రాధాన్యంగా మధ్య మధ్య ఎన్.టి.ఆర్. కూడా కనిపిస్తారు. పల్లవికి కీరవాణి రాగాన్ని, చరణాలకు నటభైరవి రాగాన్ని, పల్లవికి దారితీసే చరణాలలోని ఆఖరు వాక్యాలకు తిరిగి కీరవాణి రాగాన్ని ఉపయోగించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ సినిమాల్లో స్నానం చేస్తూ పాడుకునే పాటలెన్ని వచ్చినా సరే ఈ పాట ప్రథమ స్థానంలో ఉందంటే అందుకు కారణం - వినగానే నోటికి సులువుగా వచ్చేసే ట్యూన్, విలువలు కోల్పోకుండా సామాన్యుడికి అర్థమయ్యేలా వాడిన సరళమైన భాష అని చెప్పుకోవాలి. తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో ఈ పాట పల్లవిని డైలాగ్స్‌కి, ట్యూన్‌ని పాటల మధ్య ఇంటర్ లూడ్స్కి వాడుకోవటం కూడా జరిగింది.