Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి , Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Ghantasala / ఘంటసాల , P.Suseela / పి. సుశీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu GaMTasAla, suSIla AlapiMcAru. enTI^^Ar, sAvitri aBinayiMcAru. lakShmIdEvi, padmAvatidEvi madhya jaragabOyE saMvAda PalitaMgA tAnu Silanu kAnanna arthaMtO SrInivAsuDu - avEvI erugani tana laukika dhOraNilO padmAvati - pADutunnaTTugA pAtrOcita unmIlanaMtO rAsina AtrEya mudra - reMDava mUDava caraNAlalO balaMgA kanipistuMdi. ayitE pATa sAhityAnni kAsta lOtugA pariSIlistEgAni I 'kathArtha sUcana prakriya' avagatamavadu. TyUn paraMgA cEsukuMTE I pATa bottigA, pUrtigA peMDyAla mArku gItaM ani okaTO ekkaM appajeppinaMta suluvugA ceppeyyoccu. modaTi caraNaM 'rAgavaSamuna mEGamAlika' anE vAkyaM vinagAnE 'rAgamayi rAve' (jayaBEri) pATalO 'civurlu mEsina cinnAri kOyila' anE lainu daggari TyUn gurtukoccEstuMdi.
alAgE civarna unna 'prEmaku SOkamai PalamEmO' anE vAkyAla varasa 'cigurAkulalO cilakamma' (doMgarAmuDu) pATalOni 'kaluvA viluvalu selavIya' anE lainuni yathAtathaMgA j~japtiki tIsukostuMdi. tarvAti rOjullO vaccina 'SrIkRuShNArjuna yuddhaM' citraMlOni 'svAmula sEvaku vELAyE' pATa caraNAla iMTar lUDlO PlUT biT ni smRuti padhaMlO nilupukuni maLLI venakki vacci 'kalagA kammanikalagA' pATalOni 'tETikOsamai tEnIya dOcE' anE caraNAniki muMdu vaccE PlUT iMTar lUDtO pOlcukuMTE reMDU okkalAgE unnaTTanipistuMdi. I citrAlanniTiki saMgIta darSakuDu peMDyAla kAvaDaM, udahariMcina I pATalannI BIM plAs rAgaMlOnE uMDaDaM ivannI A rAgAnni peMDyAla malacukunE paddhatini spaShTaMgA teliyacEstAyi.
ఈ పాటను ఘంటసాల, సుశీల ఆలపించారు. ఎన్టీఆర్, సావిత్రి అభినయించారు. లక్ష్మీదేవి, పద్మావతిదేవి మధ్య జరగబోయే సంవాద ఫలితంగా తాను శిలను కానన్న అర్థంతో శ్రీనివాసుడు - అవేవీ ఎరుగని తన లౌకిక ధోరణిలో పద్మావతి - పాడుతున్నట్టుగా పాత్రోచిత ఉన్మీలనంతో రాసిన ఆత్రేయ ముద్ర - రెండవ మూడవ చరణాలలో బలంగా కనిపిస్తుంది. అయితే పాట సాహిత్యాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తేగాని ఈ 'కథార్థ సూచన ప్రక్రియ' అవగతమవదు. ట్యూన్ పరంగా చేసుకుంటే ఈ పాట బొత్తిగా, పూర్తిగా పెండ్యాల మార్కు గీతం అని ఒకటో ఎక్కం అప్పజెప్పినంత సులువుగా చెప్పెయ్యొచ్చు. మొదటి చరణం 'రాగవశమున మేఘమాలిక' అనే వాక్యం వినగానే 'రాగమయి రావె' (జయభేరి) పాటలో 'చివుర్లు మేసిన చిన్నారి కోయిల' అనే లైను దగ్గరి ట్యూన్ గుర్తుకొచ్చేస్తుంది.
అలాగే చివర్న ఉన్న 'ప్రేమకు శోకమై ఫలమేమో' అనే వాక్యాల వరస 'చిగురాకులలో చిలకమ్మ' (దొంగరాముడు) పాటలోని 'కలువా విలువలు సెలవీయ' అనే లైనుని యథాతథంగా జ్ఞప్తికి తీసుకొస్తుంది. తర్వాతి రోజుల్లో వచ్చిన 'శ్రీకృష్ణార్జున యుద్ధం' చిత్రంలోని 'స్వాముల సేవకు వేళాయే' పాట చరణాల ఇంటర్ లూడ్లో ఫ్లూట్ బిట్ ని స్మృతి పధంలో నిలుపుకుని మళ్ళీ వెనక్కి వచ్చి 'కలగా కమ్మనికలగా' పాటలోని 'తేటికోసమై తేనీయ దోచే' అనే చరణానికి ముందు వచ్చే ఫ్లూట్ ఇంటర్ లూడ్తో పోల్చుకుంటే రెండూ ఒక్కలాగే ఉన్నట్టనిపిస్తుంది. ఈ చిత్రాలన్నిటికి సంగీత దర్శకుడు పెండ్యాల కావడం, ఉదహరించిన ఈ పాటలన్నీ భీం ప్లాస్ రాగంలోనే ఉండడం ఇవన్నీ ఆ రాగాన్ని పెండ్యాల మలచుకునే పద్ధతిని స్పష్టంగా తెలియచేస్తాయి.