This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Muddubidda
Song » Choodaalani Vundhi / చూడాలని ఉంది
Click To Rate




* Voting Result *
0 %
0 %
0 %
0 %
100.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 'cUDAlani uMdi' pATanu suSIla pADagA mAsTar veMkaTES aBinayiMcAru. pallavini, caraNAlalOni modaTi reMDu lainlani  'madhyamAvati' rAgaMlO svaraparicAru. pATallO kavulu tama mEdhO saMpadanu cUpiMcukunE prayatnaM cEyaTaM maMcidE. avasaraM kUDA. ayitE adi pAtrala sthAyiki miMcinadi, diMcEdi ayitEnE vastuMdi cikku. muKyaMgA pillala pATalu rAsETappuDu eMducEtanO I viShayAnni paTTiMcukunE prayatnaM aMtagA kanabaDadu. kAnI Arudra rAsina I pATa vinagAnE ceppoccu idi pillalu pADE pATani.


 'bAla BAShani' SaBAShanipiMcE vidhaMgA upayOgiMcina ArudratO tarvAttarvAta pillala pATalenniTinO rAyiMcaDAniki I gItaM O vidhaMgA punAdi ayiMdani ceppoccu. I pATani rikArDu cEsE samayaMlO pADaDAniki vaccina suSIla oMTlO bAgOlEni kAraNaMgA marO rOju rikArDiMg peTTukOmani kOraDaM jarigiMdaTa. kAnI saMgIta darSakuDu peMDyAla 'EM ParvAlEdu alAgE pADu' ani bAgA naccaceppi pADiMcAraTa. rikArD ayina pATa vinna suSIla AScaryapOyAraTa. 'iMta bAgA vastuMdanukOlEdu' aMTU eMtO AnaMdiMcAraTa.

paina udahariMcina pATalE kAka pIlU rAgaMlO pi.lIla pADina 'jaya maMgaLa gaurIdEvI' pATa kUDA I citraMlO uMdi. telugunATa nETikI O saMpradAya gItaMgA iLLalO jarupukunE pUjala samayaMlO muttayiduvula cEta pADabaDutunna gItamidi. aTu nEla viDici sAmu ceyyakuMDA iTu nElabArugA uMDakuMDA sAmAnyuDiki saitaM arthamayyElA sinI gItAnni rAyaDaMlO Arudra mudranu oka pArSvaMlO AviShkariMcina I citraMlOni gItAlu rasAMbudhi nuMDi jAluvArina jalapAtAlu.
Important information - Telugu

 'చూడాలని ఉంది' పాటను సుశీల పాడగా మాస్టర్ వెంకటేశ్ అభినయించారు. పల్లవిని, చరణాలలోని మొదటి రెండు లైన్లని  'మధ్యమావతి' రాగంలో స్వరపరిచారు. పాటల్లో కవులు తమ మేధో సంపదను చూపించుకునే ప్రయత్నం చేయటం మంచిదే. అవసరం కూడా. అయితే అది పాత్రల స్థాయికి మించినది, దించేది అయితేనే వస్తుంది చిక్కు. ముఖ్యంగా పిల్లల పాటలు రాసేటప్పుడు ఎందుచేతనో ఈ విషయాన్ని పట్టించుకునే ప్రయత్నం అంతగా కనబడదు. కానీ ఆరుద్ర రాసిన ఈ పాట వినగానే చెప్పొచ్చు ఇది పిల్లలు పాడే పాటని.


 'బాల భాషని' శభాషనిపించే విధంగా ఉపయోగించిన ఆరుద్రతో తర్వాత్తర్వాత పిల్లల పాటలెన్నిటినో రాయించడానికి ఈ గీతం ఓ విధంగా పునాది అయిందని చెప్పొచ్చు. ఈ పాటని రికార్డు చేసే సమయంలో పాడడానికి వచ్చిన సుశీల ఒంట్లో బాగోలేని కారణంగా మరో రోజు రికార్డింగ్ పెట్టుకోమని కోరడం జరిగిందట. కానీ సంగీత దర్శకుడు పెండ్యాల 'ఏం ఫర్వాలేదు అలాగే పాడు' అని బాగా నచ్చచెప్పి పాడించారట. రికార్డ్ అయిన పాట విన్న సుశీల ఆశ్చర్యపోయారట. 'ఇంత బాగా వస్తుందనుకోలేదు' అంటూ ఎంతో ఆనందించారట.

పైన ఉదహరించిన పాటలే కాక పీలూ రాగంలో పి.లీల పాడిన 'జయ మంగళ గౌరీదేవీ' పాట కూడా ఈ చిత్రంలో ఉంది. తెలుగునాట నేటికీ ఓ సంప్రదాయ గీతంగా ఇళ్ళలో జరుపుకునే పూజల సమయంలో ముత్తయిదువుల చేత పాడబడుతున్న గీతమిది. అటు నేల విడిచి సాము చెయ్యకుండా ఇటు నేలబారుగా ఉండకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సినీ గీతాన్ని రాయడంలో ఆరుద్ర ముద్రను ఒక పార్శ్వంలో ఆవిష్కరించిన ఈ చిత్రంలోని గీతాలు రసాంబుధి నుండి జాలువారిన జలపాతాలు.