Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : C.R.Subbaraaman / సి.ఆర్.సుబ్బరామన్ ,
Lyrics Writer : Samudrala Junior / సముద్రాల జూనియర్ ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.lIla pADagA sAvitri aBinayiMcAru. akkinEni kUDA sannivESaMlO uMTAru. I pATaku racana samudrAla.(jUniyar, sIniyar pratyEkaMgA pErkonabaDalEdu) sAdhAraNaMgA sAkI, pallavi, caraNaM ilA pATalO uMTuMTAyi. kAnI toluta pallavi, A taruvAta caraNaM, A taruvAta sAkIla vale anipiMcE caraNAlu uMDaTaM I pATa pratyEkata. sAhityAnni paTTiMcukunE alavATunna vArini 'taritIpi ' anE prayOgaM AkarShistuMdI pATalO. tari aMTE gADhamaina, cikkani,dhRuDhamaina ani ardhAlunnAyi. I sinimAki saMgItaM si.Ar.subbarAman aMD GaMTasAla ani TaiTils lO uMTuMdi.
'aMdamE AnaMdaM' pATanu GaMTasAle svaraparacinaTTugA samudrAla jUniyar ceppina mATalani baTTi telustOMdi. kAsta jAgrattagA gamanistE "EdO mattumaMdu jalli" I pATanu kUDA GaMTasAlE svaraparacinaTTu manaki telisipOtuMdi. kAvAlaMTE I pATanu saMpAdiMci vinaMDi. kalavaramAye / palukE rAdAye anE vAkyAla daggara vaccE TyUn ni alA AlapiMcukuMTU pOtE 'marmayOgi ' sinimAlOni 'navvula nadilo puvvula paDava kadilE' pATa daggara tEltAM. I pATaki kUDA saMgItaM GaMTasAlE .idE naDaka 'EdO mattu maMdu ' pATalO paina pErkonna vAkyAla daggara kanipistuMdi. gamaniMcaMDi.
I 'bratuku teruvu ' sinimalO gala pATalalO 'gAli mEDalA kUlE ASA' anE pATanu mAtraM subbarAman TyUn cEsi canipOyArani, migilina pATalannI GaMTasAlE TyUn cESArani Ayana satImaNi sAvitri gAru telipAru. I 'gAli mEDalA kUlE ASA' prasAdarAvu pADAraTa.
ఈ పాటను పి.లీల పాడగా సావిత్రి అభినయించారు. అక్కినేని కూడా సన్నివేశంలో ఉంటారు. ఈ పాటకు రచన సముద్రాల.(జూనియర్, సీనియర్ ప్రత్యేకంగా పేర్కొనబడలేదు) సాధారణంగా సాకీ, పల్లవి, చరణం ఇలా పాటలో ఉంటుంటాయి. కానీ తొలుత పల్లవి, ఆ తరువాత చరణం, ఆ తరువాత సాకీల వలె అనిపించే చరణాలు ఉండటం ఈ పాట ప్రత్యేకత. సాహిత్యాన్ని పట్టించుకునే అలవాటున్న వారిని 'తరితీపి ' అనే ప్రయోగం ఆకర్షిస్తుందీ పాటలో. తరి అంటే గాఢమైన, చిక్కని,ధృఢమైన అని అర్ధాలున్నాయి. ఈ సినిమాకి సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ అండ్ ఘంటసాల అని టైటిల్స్ లో ఉంటుంది. 'అందమే ఆనందం' పాటను ఘంటసాలె స్వరపరచినట్టుగా సముద్రాల జూనియర్ చెప్పిన మాటలని బట్టి తెలుస్తోంది. కాస్త జాగ్రత్తగా గమనిస్తే "ఏదో మత్తుమందు జల్లి" ఈ పాటను కూడా ఘంటసాలే స్వరపరచినట్టు మనకి తెలిసిపోతుంది. కావాలంటే ఈ పాటను సంపాదించి వినండి. కలవరమాయె / పలుకే రాదాయె అనే వాక్యాల దగ్గర వచ్చే ట్యూన్ ని అలా ఆలపించుకుంటూ పోతే 'మర్మయోగి ' సినిమాలోని 'నవ్వుల నదిలొ పువ్వుల పడవ కదిలే' పాట దగ్గర తేల్తాం. ఈ పాటకి కూడా సంగీతం ఘంటసాలే .ఇదే నడక 'ఏదో మత్తు మందు ' పాటలో పైన పేర్కొన్న వాక్యాల దగ్గర కనిపిస్తుంది. గమనించండి.
ఈ 'బ్రతుకు తెరువు ' సినిమలో గల పాటలలో 'గాలి మేడలా కూలే ఆశా' అనే పాటను మాత్రం సుబ్బరామన్ ట్యూన్ చేసి చనిపోయారని, మిగిలిన పాటలన్నీ ఘంటసాలే ట్యూన్ చేశారని ఆయన సతీమణి సావిత్రి గారు తెలిపారు. ఈ 'గాలి మేడలా కూలే ఆశా' ప్రసాదరావు పాడారట.
రాజా
డి.టి.పి. కర్టెసీ : శ్రీమతి సునీత ఆకెళ్ళ