This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Bratuku-theruvu
Song » Andame Anandam / అందమె ఆనందం
Click To Rate




* Voting Result *
5.00 %
5.00 %
5.00 %
5.00 %
80.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

 bIMplAs rAgaMlO svaraparacabaDina I pATani pADukOni vALLu, kaMThOpAThaM rAni vALLu A rOjullO dAdApugA arudanE ceppAli. GaMTasAla pADina I pATanu terapai akkinEni nAgESvararAvu aBinayiMcagA marO sannivESaMlO sAvitriki pi.lIla idE varusagA pADina pATa koddi mArpulatO ilA uMTuMdi.

AnATi sinI gItAllO saMgIta sAhityAlu pavitra pUjA prasunAla vale eMtagA gubALiMci prakASiMcEvO ceppaDAniki I pATE oka udAharaNa. aMtE kAdu O vaipu kavitA sugaMdhAlu virajimmutU marOvaipu kathAparaMgA pADE pAtrala vyaktitvAlu, sannivESAnuguNamaina rasapOShaNa kUDA pratiPaliMpa cEsEvi. aMdukE BAryApillalapai prEma kaligina kathAnAyakuDu (akkinEni) modaTi caraNaMlO 'jIvitame madhurAnurAgaM' aMTADu. vArikOsaM cEstunna udyOgAnni rakShiMcukOvaDAniki peLLi kAlEdani abaddaM ceppi A bratukulO tana bratuku teruvuni cUsukuMTunnADu. kAbaTTi, reMDO caraNaMlO 'jIvitame oka nATaka raMgaM' aMTADu.

 I viShayaM teliyaka atanipai prEmanu peMcukunna marO kathAnAyiki (sAvitri) 'jIvitame anurAga yOgaM' aMTU manasulOni mATanu baiTa peDutuMdi. jIvitAnuBava sArAnni kAci vaDabOsi, pAtralOki parakAya pravESaM cEyagaligina kavi rAsina prati akSharaM SilAkSharamaipOtuMdi. A SilAkSharAlanu SilpaMgA malaci prANapratiShTa cEyagaligina prati svaraM jIva svaramai pOtuMdi. vITanniTinI IpATa nirUpistuMdi. aMdukE I pATa 55 saMvatsarAlu dATinA iMkA prEkShaka SrOtala hRudayAllO cekku cedarakuMDA uMdi.

Important information - Telugu

బీంప్లాస్ రాగంలో స్వరపరచబడిన ఈ పాటని పాడుకోని వాళ్ళు, కంఠోపాఠం రాని వాళ్ళు ఆ రోజుల్లో దాదాపుగా అరుదనే చెప్పాలి. ఘంటసాల పాడిన ఈ పాటను తెరపై అక్కినేని నాగేశ్వరరావు అభినయించగా మరో సన్నివేశంలో సావిత్రికి పి.లీల ఇదే వరుసగా పాడిన పాట కొద్ది మార్పులతో ఇలా ఉంటుంది.

ఆనాటి సినీ గీతాల్లో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా ప్రసునాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. అంతే కాదు ఓ వైపు కవితా సుగంధాలు విరజిమ్ముతూ మరోవైపు కథాపరంగా పాడే పాత్రల వ్యక్తిత్వాలు, సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింప చేసేవి. అందుకే భార్యాపిల్లలపై ప్రేమ కలిగిన కథానాయకుడు (అక్కినేని) మొదటి చరణంలో 'జీవితమె మధురానురాగం' అంటాడు. వారికోసం చేస్తున్న ఉద్యోగాన్ని రక్షించుకోవడానికి పెళ్ళి కాలేదని అబద్దం చెప్పి ఆ బ్రతుకులో తన బ్రతుకు తెరువుని చూసుకుంటున్నాడు. కాబట్టి, రెండో చరణంలో 'జీవితమె ఒక నాటక రంగం' అంటాడు.

 ఈ విషయం తెలియక అతనిపై ప్రేమను పెంచుకున్న మరో కథానాయికి (సావిత్రి) 'జీవితమె అనురాగ యోగం' అంటూ మనసులోని మాటను బైట పెడుతుంది. జీవితానుభవ సారాన్ని కాచి వడబోసి, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగిన కవి రాసిన ప్రతి అక్షరం శిలాక్షరమైపోతుంది. ఆ శిలాక్షరాలను శిల్పంగా మలచి ప్రాణప్రతిష్ట చేయగలిగిన ప్రతి స్వరం జీవ స్వరమై పోతుంది. వీటన్నిటినీ ఈపాట నిరూపిస్తుంది. అందుకే ఈ పాట 55 సంవత్సరాలు దాటినా ఇంకా ప్రేక్షక శ్రోతల హృదయాల్లో చెక్కు చెదరకుండా ఉంది.