Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Bheemavarapu Narasimha Rao (BNR) / భీమవరపు నరసింహా రావు (బియెన్నార్) ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Aakula Narasimha Rao / ఆకుల నరసింహా రావు ,
Song Category : Others
Song- Ragam :
I pATanu Akula narasiMhArAvu pADEru. sinimAlO O haridAsu (pAtradhAri pEru beMgaLUru raMgasvAmi) illillU tirugutU hIrOyan (sAvitri) iMTi muMdu AgipADE pATa idi. appaTlO mana telugu sinI saMgItaMpainA, raMgasthala saMgItaMpainA marAThI nATaka gItAla praBAvaM uMDEdi.
A varasala praBAvaM AdhAraMgA kUrcina I pATalO koMtavaraku KamAj, mOhana, yaman vaMTi rAgAla CAyalanu akkaDakkaDa kanipiMcETlugA TyUnni rUpoMdiMcAru. 'pATa pADaTaM' anE vyApakAnni nijAyitIgA svIkariMcE prativArU cittaSuddhitO sAdhana cEyadagga TyUn idi. ilAMTi varasalni prAkTIs ceyyaTaM valana gAtrAniki susvara vyAyAmaM jarugutuMdi.
ఈ పాటను ఆకుల నరసింహారావు పాడేరు. సినిమాలో ఓ హరిదాసు (పాత్రధారి పేరు బెంగళూరు రంగస్వామి) ఇల్లిల్లూ తిరుగుతూ హీరోయన్ (సావిత్రి) ఇంటి ముందు ఆగిపాడే పాట ఇది. అప్పట్లో మన తెలుగు సినీ సంగీతంపైనా, రంగస్థల సంగీతంపైనా మరాఠీ నాటక గీతాల ప్రభావం ఉండేది.
ఆ వరసల ప్రభావం ఆధారంగా కూర్చిన ఈ పాటలో కొంతవరకు ఖమాజ్, మోహన, యమన్ వంటి రాగాల ఛాయలను అక్కడక్కడ కనిపించేట్లుగా ట్యూన్ని రూపొందించారు. 'పాట పాడటం' అనే వ్యాపకాన్ని నిజాయితీగా స్వీకరించే ప్రతివారూ చిత్తశుద్ధితో సాధన చేయదగ్గ ట్యూన్ ఇది. ఇలాంటి వరసల్ని ప్రాక్టీస్ చెయ్యటం వలన గాత్రానికి సుస్వర వ్యాయామం జరుగుతుంది.