Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : P. Suribabu / పి. సూరిబాబు ,
Song Category : Others
Song- Ragam :
I pATanu pi.sUribAbu gAnaM cEsi aBinayiMcAru. adButamaina svaradhATi kaligina pi.sUribAbu guriMci I taraM vAriki bottigA teliyadu. vicitraM EmITaMTE sinI saMgIta raMgaMlOnunna vArilO kUDA cAlAmaMdiki teliyadu. vArikannA SrOtalOnE ekkuvamaMdi telisinavALLunnAranipistuMdi. I pATaku racana AtrEya. BaktigItAlu AtrEya rAyaDani cAlAmaMdi anukuMTAru gAnI Ayana rAsinavennO unnAyi. siMdhuBairavi rAgaMlO sAgina I pATani kUDA niDivi kAraNaMgA citraM nuMDi tolagiMcAru. SrI vEMkaTESvara vaiBavaM sinimAtOpATu vEsina SrI vEMkaTESvara mahatmyaM kAMbinEShan kyAseTlO kUDA lEdu. hec.eM.vi.lO panicEsina SivaprasAd mAtraM 78 Ar.pi.yam. rikArDullO dorikina I pATani TEpullOki TrAnsPar cEsi 'siMgiMg sTArs' anE kAnsepTtO O ADiyO kyAseTgA viDudala cEstE adRuShTavaSAttu maLLI baiTikocciMdi.
ఈ పాటను పి.సూరిబాబు గానం చేసి అభినయించారు. అద్భుతమైన స్వరధాటి కలిగిన పి.సూరిబాబు గురించి ఈ తరం వారికి బొత్తిగా తెలియదు. విచిత్రం ఏమీటంటే సినీ సంగీత రంగంలోనున్న వారిలో కూడా చాలామందికి తెలియదు. వారికన్నా శ్రోతలోనే ఎక్కువమంది తెలిసినవాళ్ళున్నారనిపిస్తుంది. ఈ పాటకు రచన ఆత్రేయ. భక్తిగీతాలు ఆత్రేయ రాయడని చాలామంది అనుకుంటారు గానీ ఆయన రాసినవెన్నో ఉన్నాయి. సింధుభైరవి రాగంలో సాగిన ఈ పాటని కూడా నిడివి కారణంగా చిత్రం నుండి తొలగించారు. శ్రీ వేంకటేశ్వర వైభవం సినిమాతోపాటు వేసిన శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం కాంబినేషన్ క్యాసెట్లో కూడా లేదు. హెచ్.ఎం.వి.లో పనిచేసిన శివప్రసాద్ మాత్రం 78 ఆర్.పి.యమ్. రికార్డుల్లో దొరికిన ఈ పాటని టేపుల్లోకి ట్రాన్స్ఫర్ చేసి 'సింగింగ్ స్టార్స్' అనే కాన్సెప్ట్తో ఓ ఆడియో క్యాసెట్గా విడుదల చేస్తే అదృష్టవశాత్తు మళ్ళీ బైటికొచ్చింది.