Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Shantha Kumari . P . / పి. శాంతకుమారి ,
Song Category : Others
Song- Ragam :
I pATanu SAMtakumAri gAnaM cEsi, AmeyE muKyapAtradhAriNigA aBinayiMcagA citrIkariMcAru. pIlU rAgAniki ati cakkani udAharaNa I pATa. I rAgaMlO idE anuBUtitO peMDyAla 'SrIkRuShNArjuna yuddhaM' citraMlO svaraparacina 'nIkai vEcitinayyA O EkAMta rAmayyA...' pATanu kUDA I saMdarBaMgA gurtu cEsukOgaligitE pIlU rAgaMpai koMta avagAhana kalugutuMdi. I pATa sAhityAnni parikistE - dvApara yugaMlOni yaSOdayE kaliyugaMlO vakuLagA janiMciMdanna purANa gAdhala aucityAnni oMTa paTTiMcukuni - vakuLa goMtuku yaSOda manasu jata cEstU AtrEya rASArA anipistuMdi. muKyaMgA - 'vEci vEci I vennamuddavale karigipOyerA nA batuku, pAlanu muccili parula cEtilO debbalu tinakurA kannayyA I talli hRudayaM OrvalEdayA... lAMTi vAkyAlanu gamanistE mAtRu hRudayaM anE AlayaMlO akShara dIpAlanu peTTi - kavigA tana ruNaM Ayana tIrcukunnADEmOnannaMta unnataMgA uMdI BAvaprakaTana. SAMtakumAri gaLaM kUDA adE tadAtmyAni paMcutuMdi. ika I pATalO upayOgiMcina muccili (doMgaliMcuTa) anE padaM telugu sinimA pATallO A tarvAta vaccinaTTugA lEdu.
I citraMlO es.varalakShmi, SAMtakumAri pADina pATalanu vinna tarvAta A svarNa yugAnni tirigi poMdE adRuShTaM mana telugu sinimA saMgItAniki uMdA ani evarikainA anipistE - kAla pravAhAniki edurIdi nilabaDagaligE mAnavatvapu viluvalu vArilO iMkA unnaTTu lekka.
ఈ పాటను శాంతకుమారి గానం చేసి, ఆమెయే ముఖ్యపాత్రధారిణిగా అభినయించగా చిత్రీకరించారు. పీలూ రాగానికి అతి చక్కని ఉదాహరణ ఈ పాట. ఈ రాగంలో ఇదే అనుభూతితో పెండ్యాల 'శ్రీకృష్ణార్జున యుద్ధం' చిత్రంలో స్వరపరచిన 'నీకై వేచితినయ్యా ఓ ఏకాంత రామయ్యా...' పాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోగలిగితే పీలూ రాగంపై కొంత అవగాహన కలుగుతుంది. ఈ పాట సాహిత్యాన్ని పరికిస్తే - ద్వాపర యుగంలోని యశోదయే కలియుగంలో వకుళగా జనించిందన్న పురాణ గాధల ఔచిత్యాన్ని ఒంట పట్టించుకుని - వకుళ గొంతుకు యశోద మనసు జత చేస్తూ ఆత్రేయ రాశారా అనిపిస్తుంది. ముఖ్యంగా - 'వేచి వేచి ఈ వెన్నముద్దవలె కరిగిపోయెరా నా బతుకు, పాలను ముచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా ఈ తల్లి హృదయం ఓర్వలేదయా... లాంటి వాక్యాలను గమనిస్తే మాతృ హృదయం అనే ఆలయంలో అక్షర దీపాలను పెట్టి - కవిగా తన రుణం ఆయన తీర్చుకున్నాడేమోనన్నంత ఉన్నతంగా ఉందీ భావప్రకటన. శాంతకుమారి గళం కూడా అదే తదాత్మ్యాని పంచుతుంది. ఇక ఈ పాటలో ఉపయోగించిన ముచ్చిలి (దొంగలించుట) అనే పదం తెలుగు సినిమా పాటల్లో ఆ తర్వాత వచ్చినట్టుగా లేదు.
ఈ చిత్రంలో ఎస్.వరలక్ష్మి, శాంతకుమారి పాడిన పాటలను విన్న తర్వాత ఆ స్వర్ణ యుగాన్ని తిరిగి పొందే అదృష్టం మన తెలుగు సినిమా సంగీతానికి ఉందా అని ఎవరికైనా అనిపిస్తే - కాల ప్రవాహానికి ఎదురీది నిలబడగలిగే మానవత్వపు విలువలు వారిలో ఇంకా ఉన్నట్టు లెక్క.