Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : S.Varalakshmi / ఎస్. వరలక్ష్మి , Savithri / సావిత్రి ,
Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,
Singer : Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) , P. Leela / పి. లీల ,
Song Category : Others
Song- Ragam :
AtrEya rAsina I pATalO lIla, jikki pradhAna gAyanI maNulu, pradhAna, muKya, saha upapAtradhAruleMtO maMdi mIda citrIkariMcina pATayidani sAhityaM cUDagAnE arthamayipOtuMdi. pATa pallavi nuMDi tolicaraNaM (cUtamu rArE sudatulaMdarU) civari varakU sAmarAgAnni, reMDava caraNaM (ativa kOri varuDu atilOka suMdaruDOyammA)ki mOhanarAgAnni upayOgiMcAru. mUDava caraNaM (cilakalakoliki padmAvatiki kulukE siMgAraM)ki aMtargAMdhArAnni kalupukuMTU Karahapriya skEllOni svarAlni, akkaDakkaDa pIlU rAgaM anipiMcElA kUDA svaraparicAru. ika AKari caraNaM (callanaina tallivi SaMkaruni rANivi)ki pakkA saMpradAyarItilO SaMkarABaraNaM rAgAnni upayOgiMcAru. I caraNAnni, sItArAmakaLyANaMlOni 'kAnarAra kailAsa nivAsA' pATani, BUkailAs lOni 'dEvamahadEva mamubrOvamu Siva' pATani, sAkalyaMgA sAdhana cEstE SaMkarABaraNa rAgaMpai avagAhana cAlAvaraku vaccEstuMdi.
ఆత్రేయ రాసిన ఈ పాటలో లీల, జిక్కి ప్రధాన గాయనీ మణులు, ప్రధాన, ముఖ్య, సహ ఉపపాత్రధారులెంతో మంది మీద చిత్రీకరించిన పాటయిదని సాహిత్యం చూడగానే అర్థమయిపోతుంది. పాట పల్లవి నుండి తొలిచరణం (చూతము రారే సుదతులందరూ) చివరి వరకూ సామరాగాన్ని, రెండవ చరణం (అతివ కోరి వరుడు అతిలోక సుందరుడోయమ్మా)కి మోహనరాగాన్ని ఉపయోగించారు. మూడవ చరణం (చిలకలకొలికి పద్మావతికి కులుకే సింగారం)కి అంతర్గాంధారాన్ని కలుపుకుంటూ ఖరహప్రియ స్కేల్లోని స్వరాల్ని, అక్కడక్కడ పీలూ రాగం అనిపించేలా కూడా స్వరపరిచారు. ఇక ఆఖరి చరణం (చల్లనైన తల్లివి శంకరుని రాణివి)కి పక్కా సంప్రదాయరీతిలో శంకరాభరణం రాగాన్ని ఉపయోగించారు. ఈ చరణాన్ని, సీతారామకళ్యాణంలోని 'కానరార కైలాస నివాసా' పాటని, భూకైలాస్ లోని 'దేవమహదేవ మముబ్రోవము శివ' పాటని, సాకల్యంగా సాధన చేస్తే శంకరాభరణ రాగంపై అవగాహన చాలావరకు వచ్చేస్తుంది.