This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Missamma
Song » Telusukonave Chelli / తెలుసుకొనవే చెల్లి
Click To Rate




* Voting Result *
20.00 %
20.00 %
20.00 %
20.00 %
20.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - English

I pATanu pi.lIla pADagA sAvitri, jamuna, yan.Ti.rAmArAvu aBinayiMcAru. ennELLu gaDicinA - eppuDu anvayiMcukunnA - 'karakTE sumA' ani anipiMpajEsE sAhityAnni aMdiMcina piMgaLi vAriki ADavAraMtA RuNapaDi uMDaka tappadanipistuMdi. I pATa arthAnni asAMtaM AkaLiMpu cEsukOgaligina E ammAyikI eTuvaMTi jAgrattalU ceppanavasaraM lEdu. TyUn paraMgA ceppAlsivastE  - bEhAg, yaman, KamAc rAgAlanu rEKA mAtraMgA spRuSistU 'rAjESvararAvu Taip AP kamAc'ni sAdhana cEyaDAniki vIlaina vidhaMgA cakkaTi TyUnni iccAru rAjESvararAvu. KamAc rAgaMlO rAjESvararAvudi O pratyEka Saili.

'eMdukE nI kiMta toMdarA' (mallISvari) vaMTi klAsikal TyUnni, 'pADamani nannaDagavalenA' (DAkTar cakravarti) vaMTi semI klAsikal TyUnni aMdiMcagaligADAyana. A reMDu pATalanI sAdhana cEstE reMDu vaividhyAlani svaMtaM cEsukunnaTlE. idilA uMDagA O cinna pariSIlana - cAlAmaMdiki 'paDOsan' sinimA gurtuMDE uMTuMdi. A sinimAlOni 'Ek ctur nAr' pATalO 'thAnArE jAre jAre....' anE pATa! KEm caMd prakAS svaraparacina A pATanu lata pADiMdi. A pATa konni ShApullO iMkA dorukutOMdi. vIlaitE saMpAdiMci vinaMDi. I 'caMdArE jArE jArE' pATa inspirEShan 'telusukonavE yuvatI' pATani svaraparustunnapuDu rAjESvararAvugAri manasulO rEKA mAtraMgAnainA uMDi uMDAlani I samIkShakuni vyaktigata aBiprAyaM. kAvAlaMTE caraNAMtAlalOni TyUnni 'caMdArE jArE jArE'tO kalupukuni cUDaMDi. eMta cakkagA atikipOtuMdO telustuMdi.
Important information - Telugu

  à°ˆ పాటను పి.లీల పాడగా సావిత్రి, జమున, యన్.à°Ÿà°¿.రామారావు అభినయించారు. ఎన్నేళ్ళు గడిచినా - ఎప్పుడు అన్వయించుకున్నా - 'కరక్టే సుమా' అని అనిపింపజేసే సాహిత్యాన్ని అందించిన పింగళి వారికి ఆడవారంతా ఋణపడి ఉండక తప్పదనిపిస్తుంది. à°ˆ పాట అర్థాన్ని అసాంతం ఆకళింపు చేసుకోగలిగిన ఏ అమ్మాయికీ ఎటువంటి జాగ్రత్తలూ చెప్పనవసరం లేదు. ట్యూన్ పరంగా చెప్పాల్సివస్తే  - బేహాగ్, యమన్, ఖమాచ్ రాగాలను రేఖా మాత్రంగా స్పృశిస్తూ 'రాజేశ్వరరావు టైప్ ఆఫ్ కమాచ్'ని సాధన చేయడానికి వీలైన విధంగా చక్కటి ట్యూన్ని ఇచ్చారు రాజేశ్వరరావు. ఖమాచ్ రాగంలో రాజేశ్వరరావుది à°“ ప్రత్యేక శైలి.



'ఎందుకే నీ కింత తొందరా' (మల్లీశ్వరి) వంటి క్లాసికల్ ట్యూన్ని, 'పాడమని నన్నడగవలెనా' (డాక్టర్ చక్రవర్తి) వంటి సెమీ క్లాసికల్ ట్యూన్ని అందించగలిగాడాయన. ఆ రెండు పాటలనీ సాధన చేస్తే రెండు వైవిధ్యాలని స్వంతం చేసుకున్నట్లే. ఇదిలా ఉండగా ఓ చిన్న పరిశీలన - చాలామందికి 'పడోసన్' సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలోని 'ఏక్ చ్తుర్ నార్' పాటలో 'థానారే జారె జారె....' అనే పాట! ఖేమ్ చంద్ ప్రకాశ్ స్వరపరచిన ఆ పాటను లత పాడింది. ఆ పాట కొన్ని షాపుల్లో ఇంకా దొరుకుతోంది. వీలైతే సంపాదించి వినండి. ఈ 'చందారే జారే జారే' పాట ఇన్స్పిరేషన్ 'తెలుసుకొనవే యువతీ' పాటని స్వరపరుస్తున్నపుడు రాజేశ్వరరావుగారి మనసులో రేఖా మాత్రంగానైనా ఉండి ఉండాలని ఈ సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం. కావాలంటే చరణాంతాలలోని ట్యూన్ని 'చందారే జారే జారే'తో కలుపుకుని చూడండి. ఎంత చక్కగా అతికిపోతుందో తెలుస్తుంది.