Actor :
Actress : Anjali devi / అంజలి దేవి ,
Music Director : Ghantasala / ఘంటసాల ,
Lyrics Writer : Jampana / జంపన ,
Singer : P. Leela / పి. లీల ,
Song Category : Love & Romantic Songs
Song- Ragam :
I pATanu jaMpana rAyagA pi.lIla AlapiMcagA aMjalIdEvi aBinayiMciMdi. GaMTasAla svaraparacina gItAla akauMTulO cUsukunnA - pi.lIla pADina pATala akauMTulO cUsukunnA - cAlA maMcipATa idi. eMtOmaMdi saMgIta priyula smRutipathaM nuMDi toligipOvaDaM vallanO EmO tagina AdaraNa laBiMcani cakkani pATa idi.
ఈ పాటను జంపన రాయగా పి.లీల ఆలపించగా అంజలీదేవి అభినయించింది. ఘంటసాల స్వరపరచిన గీతాల అకౌంటులో చూసుకున్నా - పి.లీల పాడిన పాటల అకౌంటులో చూసుకున్నా - చాలా మంచిపాట ఇది. ఎంతోమంది సంగీత ప్రియుల స్మృతిపథం నుండి తొలిగిపోవడం వల్లనో ఏమో తగిన ఆదరణ లభించని చక్కని పాట ఇది.
ఇవాళ గనుక ఈ పాటను వినడం జరిగితే - 'అలిగినవేళనె చూడాలి' (గుండమ్మ కథ) పాటలా ఉంది కదూ అని ప్రతి సంగీత ప్రియుడు అనుకుని తీరతాడు. ముఖ్యంగా - 'ప్రియుని జేరి ఒకసారి పిలవవోయ్' / 'చలువరాతి చెరసాల చాలునోయ్' అనే వాక్యాల దగ్గర 'అలిగినవేళనె ' పాటలోని 'దృష్టి తగులునని జడిసి యశోదా' అనే వాక్యానికి జతపడిన ట్యూన్ జ్ఞాపకం వచ్చి తీరుతుంది. మంచిపాటకు చెవియొగ్గి వినే ప్రతివారి దగ్గరా ఉండతగ్గ పాట ఇది. ఈ పాటకు దేశ్ రాగం ఆధారం.